హాకీలో భార‌త్‌కు కాంస్యం

Hockey
Hockey

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సొంతం చేసుకుంది. కాంస్యం కోసం భారత్‌.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడింది. 2-1తో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకుంది. మ్యాచ్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్‌ తన తొలి గోల్‌ నమోదు చేసింది. సగం పూర్తయ్యే వరకు భారత్‌ 1-0 ఆధిక్యంలోనే కొనసాగింది. ఆ తర్వాత మరో గోల్‌ చేసి 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పాక్‌ ఒక గోల్‌ మాత్రమే చేసింది. దీంతో భారత్‌ 2-1తో మ్యాచ్‌లో విజయం సాధించి కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 69వ పతకం. భారత్‌ ఇప్పటి వరకు 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలను తన ఖాతాలో వేసుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో ఇన్ని పతకాలు గెలవడం భారత్‌కు ఇదే ప్ర‌థ‌మం.