హాకింగ్ ధైర్యం నేటి త‌రానికి ఆద‌ర్శంః మోది

hawking, modi
hawking, modi

న్యూఢిల్లీః ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌ మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హాకింగ గొప్ప శాస్త్రవేత్త అని, ఆయన పరిశోధనలు ప్రపంచానికి మార్గదర్శకం అని కొనియాడారు. ‘హాకింగ్‌ మరణం బాధాకరం. ప్రపంచం కోసం ఆయన చేసిన పరిశోధనలు విశ్వాన్ని గొప్ప స్థాయికి చేర్చాయి. ఆయన ధైర్యం నేటి తరానికి ఆదర్శం’ అని కోవింద్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.