హాంకాంగ్ ఓపెన్‌కు కూడా శ్రీకాంత్ దూరం!

Kidambi Srikanth
Kidambi Srikanth

ఢిల్లీః గాయం కారణంగా హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌కు తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ దూరం కానున్నారు. ఇప్ప‌టికే చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌కు దూరమైన శ్రీకాంత్, వచ్చే వారం జరగబోయే హాంకాంగ్ ఓపెన్‌కు దూరమ‌వుతున్న‌ట్లు అత‌ని ఫిజియో కిరణ్‌ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘శ్రీకాంత్‌ కోలుకున్నాడు. గాయం పూర్తిగా తగ్గిపోయింది. ఏదైనా టోర్నమెంట్‌లో ఆటగాడు పాల్గొనాలంటే 100శాతం ఫిట్‌గా ఉండాలి. 90 శాతం ఫిట్‌నెస్‌తో శ్రీకాంత్‌ను హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌కు పంపించాలని అనుకోవడం లేదు. అందుకే మరో వారం విశ్రాంతి సూచించాం’ అని కిరణ్ తెలిపారు.