హస్తిన పర్యటనలో తెలంగాణ మేయ‌ర్లు

Mayor & GHMC Commissioner
Mayor & GHMC Commissioner

హైదరాబాద్‌: తెలంగాణ మేయర్ల బృందం ఢిల్లీలో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా రఫీ మార్గ్‌లో పబ్లిక్‌ టాయ్‌టెట్ల‌ను మేయర్ల బృందం పరిశీలించింది. సభ్యులు పబ్లిక్‌ టాయ్‌టెట్ల‌నులో కల్పించే సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మేయర్ల బృందం లోధి గార్డెన్‌లో హైటెక్‌ నర్సరీతో పాటు న్యూఢిల్లీ మున్సిపల్‌ కమీషన్‌ చేపట్టిన పలు కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం ఎన్‌డిఎంసి అధికారులతో సమావేశమయ్యారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిహెచ్‌ఎంసీ కమీషనర్‌ జనార్ధన్‌రెడ్డి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు.