హస్తినలో బాబు ఒకరోజు దీక్ష!

AP CM BABU
AP CM BABU

అమరావతి: ఏపి హక్కుల కోసం సియం చంద్రబాబు కేంద్రంపై మరో అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. ఏపికి కేంద్రం చేస్తున్న అన్యాయాలపై ప్రజల తరఫున మాట్లాడేందుకు ఎప్పటికప్పుడు టిడిపి ఎంపీలకు ఆయన దిశానిర్ధేశం చేస్తున్నారు.. పార్లమెంటు సమావేశాలను గమనిస్తూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీలకు పలు సూచనలు చేస్తున్నారు. అంతేకాదు పార్లమెంటు సమావేశాల చివరి రోజున అస్త్రాన్ని సంధించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా దీక్షకు కూర్చుంటే ఎలా ఉంటుందనే అంశంపై టిడిపి ఎంపీల భేటిలో చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు దీక్షకు కూర్చుంటే జాతీయ నేతలంతా వచ్చి మద్దతు తెలుపుతారని ఎంపి సుజనా చౌదరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్ర సమస్యలను బడ్జెట్‌లో పరిష్కరించకపోతే దీక్షకు దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.