హర్యానాలో జింద్ ఉపఎన్నికలు ప్రారంభం

జింద్:హర్యానాలోని కీలకమైన జింద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఐఎన్ఎల్డీ అభ్యర్థి హరి చంద్ మిద్దా మృతి కారణంగా ఇక్కడ ఉపఎన్నిక జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జరుగుతున్న ఉపఎన్నిక కావడంతో అన్ని ప్రధాన పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, బీజేపీ అభ్యర్థిగా దివంగత బీజేపీ నేత హరిచంద్ మిద్దా కుమారుడు కృష్ణ మిద్దా, ఐఎన్ఎల్డీ అభ్యర్థిగా ఉమెద్ సింగ్ రెధు ఈరోజు నాటి ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 1,71,113 ఓటర్లలో 48,000 మంది ఓట్లర్లు జాట్ కులానికి చెందినవారు కావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 158 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో 68 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.