హరీశ్‌ పాపాలకు మంజీర ఎండిపోయింది

jaggareddy , harishrao
jaggareddy , harishrao

సంగారెడ్డి: సంగారెడ్డి ఎమ్మెల్యె జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతు హరీశ్‌రావు పై విరుచుకుపడ్డారు. హరీశ్‌రావు చేసిన పాపానికి ప్రస్తుతం మంజీర ఎండిపోయిందన్నారు. తాగునీటి కోసం మంజీర నీటిని ఎందుకు తరలించారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అయితే హరీశ్‌ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సిఎం కెసిఆర్‌కు తెలియకుండానే ఇదంతా చేసి ఉంటారని ఆయన తెలిపారు. అర్ధరాత్రి మంజీరా నీళ్లను దోపిడీ చేశారని ఆరోపించారు. ఈ దోపిడీ దోషి హరిశ్‌రావే తప్ప సీఎం కాదన్నారు. మంజీరా నీళ్లు ఉమ్మడి మెదక్ ప్రజలవని చెప్పారు. ఆయన చేసిన పాపం మెదక్‌ జిల్లా ప్రజలకు, సిఎం కెసిఆర్‌ కు శాపంగా మారిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లివ్వాలన్న  కెసిఆర్‌ కోరికకు హరీశ్‌ తూట్లు పొడిచారన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో హరీశ్‌ మెదక్‌ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. తక్షణం సంగారెడ్డికి నీటి కోసం రూ.10 కోట్లు విడుదల చేయాలన్నారు.