హత్యానేరంనుంచి బైటపడ్డ సిద్దూ

Navajyoth siddu
Navajyoth siddu

న్యూఢిల్లీ: క్రికెటర్‌నుంచి రాజకీయాల్లోనికి వచ్చిన పంజాబ్‌ పర్యాటక మంత్రి నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధుకి 1988లో జరిగిన దాడికేసుకు సంబంధించి శిక్ష విధించారు. అయితే కావాలని హత్యచేసారన్న అభియోగాలను మాత్రం సుప్రీంకోర్టు కొట్టివేసింది. పంజాబ్‌ అమరీందర్‌సింగ్‌ప్రభుత్వంలో పర్యాటక మంత్రిగాపనిచేస్తున్న నవ్‌జోత్‌సింగ్‌ సిద్దూ కావాలనే హత్యచేసే లక్ష్యంతోనే దాడిచేసి ముష్టిఘాతాలు వేసారని 65 ఏళ్లవ్యక్తి తలపై తీవ్ర గాయం చేసారని ఆరోపిస్తూకేసు నమోదుచేసారు. 1988లో జరిగిన ఈకేసులో ఆయన వయోవృద్ధుడైన ఒక వ్యక్తి తలపై బలంగా కొట్టారననారోపణలున్నాయి. ఈ కేసులో ఆయనకు శిక్షపడినా సిద్దు తన కేబినెట్‌పదవిని కొనసాగిస్తారు. ఎందుకంటే ప్రజాప్రాతినధ్య చట్టంప్రకారం ఒక వ్యక్తికి రెండేళ్లు లేదా అంతకుమించి శిక్షపడితే వెంటనే ప్రజాప్రతినిధిగా అనర్హత వేటు పడుతుంది. సుప్రీంకోర్టు సిద్దుకు రూ.1000 జరిమానా విధించింది. అలాగే ఎలాంటి జైలు శిక్షను విధించలేదు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈ మంత్రికి ఐపిసి సెక్షన్‌ 323 ప్రకారం ఆయనకు ఏడాదిజైలు లేదా జరిమానా లేదా రెండుశిక్షలు పడతాయని నిపుణులు అంచనావేసారు. పంజాబ్‌ప్రజలకు సిద్ధు ఈతీర్పుపట్ల ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ప్రార్థనలవల్లనే తాను పది అడుగుల ఎత్తుకు ఎదిగానని, రాహుల్‌గాంధీజీ, ప్రియాంక గాంధీజీకి సందేశం పంపిస్తూ నాజీవితం మీదేనని వెల్లడించారు. అమరీందర్‌సింగ్‌ప్రభుత్వంలో సిద్దు పర్యాటక మంత్రిగాపనిచేస్తున్నారు.గున్నామ్‌సింగ్‌ అనే 65 ఏళ్ల వ్యక్తిని పార్కింగ్‌ కారు వివాదంలో తలపై కొట్టి తీవ్రంగా గాయపరచడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. అయితే సిద్దు ఆ వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని, తాను కొట్టడం వల్ల చనిపోలేదని వెల్లడించాడు. దిగువకోర్టు విచారణలో క్రికెటర్‌ హత్యారోపణలనుంచి బైటపడ్డారు. పంజాబ్‌ హైకోర్టు ఈతీర్పును రివర్స్‌చేసింది. సిద్దు ఆయనతోపటు సహనిందితుడు రూపీందర్‌సింగ్‌ సంధులు ఇద్దరూ కూడా కావాలనే హత్యచేసే లక్ష్యంతోనే గుర్నామ్‌సింగ్‌పై దాడిచేసారని అన్నారు. 2006 డిసెంబరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. పంజాబ్‌ హైకోర్టు ఈకేసులో ఇద్దరికీ మూడేళ్ల జైలుశిక్ష, లక్షరూపాయల జరిమానాను విధించారు. సిద్ధు, సంధు ఇద్దరూ సుప్రీంకోర్టులో అప్పీలుచేసారు. 2007లో సుప్రీంకోర్టు అప్పీలులో కిందికోర్టు శిక్షపై స్టే విధించింది. దీనితో సిద్దు అమృతసర్‌ లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు మార్గం ఏర్పడింది. ఈకేసులో సహనిందితుడు సంధునుసైతం సుప్రీంకోర్టు అభియోగాలను కొట్టివేసింది.