స‌ల్మాన్‌ను క‌లిసిన ప్రీతిజింటా

Preity zinta & Salman khan
Preity zinta & Salman khan

కృష్ణ జింకల వేట కేసులో శిక్ష పడ్డ బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్‌ని గురువారం జోథ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించిన విషయం విదిత‌మే. జైల్లో ఉన్న సల్మాన్ ని బాలీవుడ్ నటి ప్రీతి జింతా ఈరోజు నేడు కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కాగా, సల్మాన్ సరసన పలు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి ప్రీతి జింతా నేడు ఉదయం జోథ్ పూర్ ఎయిర్ పోర్టులో కనపడింది. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన ప్రీతి జింతా, అప్పటికే అక్కడ ఉన్న కారులో ఎక్కి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజికమాధ్యమాల్లో చేరింది. సల్మాన్ ని కలిసేందుకు ప్రీతి జింతా వెళ్లిందన్న వార్తతో సల్లూ భాయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు వేదికగా ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నారు. ‘ఇదే నిజమైన ఫ్రెండ్ షిప్’ అంటూ ప్రీతి జింతాను కొనియాడుతున్నారు.