స‌న్‌రైజ‌ర్స్ జెర్సీని ఆవిష్క‌రించిన మెగా హీరో

SAIDHARAM TEJ
SAI DHARAM TEJ

హైద‌రాబాద్ః మరో 5 రోజుల్లో ఐపీఎల్‌ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో ఏప్రిల్ 9న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ధరించే జెర్సీని మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ ఆవిష్కరించాడు. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఫ్రాంఛైజీ నిర్వాహకులు హైదారాబాద్‌ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన సాయిధరమ్‌ తేజ్‌… అభిమానుల కోలాహలం మధ్య జెర్సీని ఆవిష్కరించి, పలువురు అభిమానులకు అందజేశాడు.