స‌చివాల‌యంలో ఉద్యోగాల పేరిట టోక‌రా

fraud in agricet
Fraud

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేసిన ఘ‌ట‌న చోటు చేసుకుంది. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన నిరుద్యోగుల నుంచి కొందరు కేటుగాళ్లు రూ. కోటి వసూలు చేశారు. నిందితుల్లో బెజవాడ నున్న పీఎస్ కానిస్టేబుల్ సంజయ్ ప్రదీప్ కూడా ఉండటం సంచలనం రేపుతోంది. కానిస్టేబుల్ సంజయ్‌తో పాటు మోసగించిన అనిల్, సునీల్ సోదరుల(వీరు పోలీసు కుటుంబాలకు చెందిన వారే)ను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.