స్వ‌ల్ప లాభాల‌తో స‌రిపెట్టుకున్న దేశీయ మార్కెట్లు

stocks
stocks

ముంబైః దేశీయ మార్కెట్ల జోరుకు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, దేశీయంగా కొనుగోళ్ల అండతో బుధవారం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత ఒత్తిడికి గురయ్యాయి. దీంతో స్టాక్‌మార్కెట్లు స్వల్పలాభానికే పరిమితమయ్యాయి.
ఈ ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఒక దశలో 130 పాయింట్లకు పైగా ఎగబాకింది. అయితే ఆ జోరును సూచీలు ఎంతోసేపు నిలబెట్టుకోలేకపోయాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో రోజులో చాలా సేపు ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు.. ఆరంభ లాభాల్లో కొంత కోల్పోవాల్సి వచ్చింది. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 47 పాయింట్లు లాభపడి 35,739 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 10,857 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.62గా కొనసాగుతోంది.