స్విట్జ‌ర్లాండ్ లో శ్రీ‌దేవి విగ్ర‌హాo

SRIDEVI
SRIDEVI

స్విట్జ‌ర్లాండ్  : దివంగ‌త న‌టి శ్రీ‌దేవికి అపూర్వ గౌర‌వం ద‌క్కింది.. స్విట్జ‌ర్లాండ్ లో ఆమె విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు.. ఈ మేర‌కు ఆ ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది..త‌మ దేశంలో షూటింగ్ జ‌రిగిన పలు చిత్రాల్లో శ్రీదేవి నటించారని స్విట్జర్లాండ్ అధికారులు తెలిపారు. శ్రీదేవి నటించిన పలు సినిమాల షూటింగులు తమ దేశంలో జరిగాయని, తద్వారా స్విట్జర్లాండ్ పర్యాటకం అభివృద్ధి చెందేందుకు కారకులయ్యారని వ్యాఖ్యానించారు.

శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. చాలా సినిమాలను స్విట్జర్లాండ్ కేంద్రంగా తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు యశ్ చోప్రా విగ్రహాన్ని స్విస్ ప్రభుత్వం 2016లో అక్కడ ఏర్పాటు చేశారు.. తాజాగా శ్రీ‌దేవి విగ్ర‌హం ఏర్పాటు చేస్తున్నారు.