స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు లూథర్డ్‌ భారత్‌ పర్యటన

swiss president  loutherd
swiss president loutherd

న్యూఢిల్లీ: భారత పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చిన స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు డోరిస్‌ లూథర్డ్‌కు రాష్ట్రపతి భవన్‌ వద్ద
ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు సాదర స్వాగతం పలికారు.
భారత్‌లో మూడు రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు. భారత్‌, స్విస్‌ సంబంధాలు మరింత మెరుగుపడేందుకు
తన పర్యటన దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణలకు తాను
ముగ్ధురాలైనట్లు లూథర్డ్‌ వెల్లడించారు.