స్వామి దర్శనానికి ఇబ్బందులు:

ప్రజావాక్కు

Devotees in tirumala
Devotees in tirumala

 

స్వామి దర్శనానికి ఇబ్బందులు: జి.అశోక్‌,గోదూరు,జగిత్యాల జిల్లా

తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎన్నో ఇబ్బందులు పడాల్సివస్తోంది.మామూలు రోజుల్లోనే భక్తు ల రద్దీఅధికం.ఇక వేసవి సెలవ్ఞల్లో ఆ సంగతి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తిరుపతిలో కాని, తిరుమలలో కాని కాటేజీ బుకింగు ను సులభతరం చేయటంలో టి.టి.డి కార్యవర్గం విఫలమవ్ఞ తుంది.వసతి కోసం కాటేజీ పొందడానికి చాలా సమయం పడు తుంది.సాధారణ క్యూలో వాళ్ళ బాధలైతే వర్ణనాతీతం.ఇంత జాప్యంఎందుకు జరుగుతుందో అక్కడ చెప్పేవారే లేరు.ఇలాంటి ఆలస్యాలను కృత్రిమంగా సృష్టిస్తున్నారు.అక్కడ ఉండే కాని స్టేబుల్‌ ను ఆశ్రయించిన వారికి బాగానే దొరుకుతున్నాయి.ఇక చాలా మంది సందర్శకులు ఎక్కువగా అక్కడే ఖాళీ స్థలంలో, డార్మిటరీలో విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. దైవ దర్శనానికి వెళ్ళే భక్తుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో?తిరుమల-తిరపతి దేవస్థానం అధికారులు ఈ అంశాలపై దృష్టి సారించి,సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.

పరిశోధనలెక్కడ?: జి.అశోక్‌,గోదూరు,జగిత్యాల జిల్లా

ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిశోధనలో భారతదేశం స్థానం ఎక్కడ? మన విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు పెద్దగా జరుగక పోవడానికి కారణాలు,నిధులకొరత,అవినీతి,ప్రభుత్వాలజోక్యం. పరిశోధనలలో అగ్రగణ్యులుగా నిలిచి దేశానికి పేరుతీసుకు వచ్చి నవారిని ఉన్నతపదవ్ఞలల్లో నియమిస్తే వారువిద్యార్థులకు మార్గ దర్శకంగా ఉంటారు. అంతేకాని అవినీతి ఆరోపణలు ఉన్నవారి ని, పైరవీలు చేసిన వారిని లేక మనవాళ్ళు సమర్థులు కానప్పటి కీ నియమిస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది. నేడు విశ్వవిద్యాలయా ల్లో శాస్త్రీయ పరిశోధనలు మృగ్యం. సమర్థులైన ఉపాధ్యాయు లు ఉంటే ముందుగానే విద్యార్థుల ప్రతిభాపాటవాలను గుర్తించి ఆదిలోనే వారిని తీర్చిదిద్ది పరిశోధన వైపు వారి దృష్టిని మళ్ళిం చాలి.ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను గుర్తించి అను భవజ్ఞులతోను,విశ్వవిద్యాలయాలను నింపేస్తేపరిశోధనలుఊపం దుకొని ప్రపంచంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంటుంది. మిస్సుల శివరామకృష్ణ ,అత్తాపూర్‌

అవినీతిని అరికట్టాలి: సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

అవినీతిరహిత పాలన అందిస్తున్నామంటూ ప్రభుత్వాలు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో భారతదేశంలో గత రెండు సంవత్సరాలలో అవినీతి 41 శాతం పెరిగిందన్న ట్రాన్స్‌ పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ తాజా నివేదిక క్షేత్రస్థాయిలో ప్రభు త్వ వైఫల్యాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. అవినీతిలో ఆసియా, పసి ఫిక్‌ దేశాలలో మనదేశం మొదటిస్థానం,ప్రపంచవ్యాప్తంగా 132 స్థానంలో నిలబడడం చూస్తుంటే దేశంలో అవినీతి అన్నిస్థాయి ల్లో వ్యాపించి ఉందన్న విషయం అర్థమవ్ఞతోంది. శాంతిభద్రత లు, బిజినెస్‌ సంస్థలు,ప్రభుత్వాధికారులు, పన్ను అధికారులతో పాటు మతపెద్దలు సైతం అవినీతిలో ముందంజలో ఉన్నారన్న నివేదిక బాధ కలిగిస్తుంది.

అతివేగం ప్రాణాపాయం: ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్ల్లా

తల్లిదండ్రులు విచక్షణారాహితంగా ఖరీదైన స్పోర్ట్స్‌ రేస్‌ బైక్‌లు కొని ఇస్తుండగా పిల్లలు సరైన డ్రైవింగ్‌ లైసెన్సులు లేకుండానే ప్రమాదకరంగా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ట్రాఫిక్‌లో అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ నూరు నుండి నూటయాభై కిలోమీటర్ల వేగంగా దూసుకుపోతున్నారు. వరుస దుర్ఘటనలలో పలువ్ఞరు యువకులు ప్రాణాలు కోల్పోతున్నా వీరు వెనక్కి తగ్గ డం లేదు. అటు తల్లిదండ్రులు ధనం వృధా చేస్తూ పిల్లలకు వయ స్సు రాకుండానే లక్షల ఖరీదు చేసే బైకులు కొనివ్వడం గమనా ర్హం.రేెసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినప్పుడు నామమాత్రపు జరిమానా విధిస్తున్నారు.కాని ఈసమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది.

శాంతిభద్రతల సమస్యలు: సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

కాశ్మీర్‌లో అశాంతి, ఆందోళనలు రేకెత్తించేందుకు పాకిస్థాన్‌ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. పాకిస్థాన్‌ నుండి చొరబడే తీవ్ర వాదులు, వేర్పాటువాదులు అల్లర్లకు పాల్పడుతూ శాంతి భద్రతల కు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. నిరుద్యోగంతో సతమతమయ్యే కాశ్మీరీ యువతను ప్రలోభపెట్టి అరాచక కార్యకలాపాలకు ప్రేరేపి ిస్తున్నాయి పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు. పాకిస్థాన్‌ ఆక్ర మిత కాశ్మీర్‌ ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను నెలకొల్పి వందల కొద్ది ఉగ్రవాదులకు కఠోర శిక్షణ ఇచ్చి అవకాశం వచ్చిన ప్పుడు మనదేశంలోనికి ప్రవేశపెడుతున్నారు.

యాచకులను ఆదుకోవాలి: కె.శివశంకర్‌, నల్గొండ

తెలంగాణ ముఖ్యమంత్రిరాష్ట్రంలోని అన్నికులవృత్తులకు ప్రాధా న్య మివ్వటం సంతోషించదగ్గ విషయం. సంప్రదాయ బద్ధంగా వస్తున్న బ్రాహ్మణ, మత్స్యకార, చేనేత, ఒడ్డెర, విశ్వబ్రాహ్మణ, గొల్ల, కురుమలు, మైనార్టీ తదితర కుల,వృత్తికారులకు ప్రోత్సా హకాలు అందిస్తున్నారు. ఏ వృత్తిలో నైపుణ్యముంటే ఆ వృత్తిదారు లను ఆదుకుంటున్నారు.అలాగే గ్రామాల్లో నగరాల్లో అనేక చోట్ల పేద బాలల భిక్షాటన సర్వసాధారణ దృశ్యంగా మారింది. రోడ్ల పక్కన, ఫ్లాట్‌ ఫారమ్‌లపై నివాసముంటున్న జనసమ్మర్ధ ప్రదేశాల లో యాచకవృత్తిని కొనసాగిస్తున్నారు. ఈ వర్గాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న బిచ్చగాళ్లకు ఉపాధి, పునరావాసం కల్పించాలి.

వెయ్యి రూపాయిల నాణేలు: బి.యన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

పెద్దనోట్లరద్దు చేసి ప్రభుత్వం వాటి స్థానంలో 2000, 500 రూపాయిల కొత్తనోట్లను ముద్రించి విడు దల చేసింది. వాటిలో అత్యధిక శాతం 2000 నోట్లు నల్లకుబేరుల వద్దకే చేరుకు న్నాయి.ఇది అందరికీ తెలిసిన విషయమే.నిజానికి పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లకుబేరులు నష్టపోయింది తక్కువే.కొత్త 2000 రూపాయి ల నోట్లు కూడా వారి వద్దకే చేరుకున్నాయి. ఇప్పుడు ఆర్‌బిఐ వెయ్యిరూపాయిల నాణేన్నిముద్రించి విడుదల చేయనుంది.