స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న స్టాక్‌మార్కెట్లు

stock exchange
stock exchange

ముంబై: దేశీయ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల ప్రభావంతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికి ,తర్వాతర్వాత ఒడిదుడుకుల్లో సాగిన సూచీలు చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100పాయింట్లు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 10900 మార్క్‌ను అందుకుంది. ఐతే చివరి గంటల్లో మళ్లీ కొనుగోళ్లు జరగడంతో సూచీలు తేరుకుని సెన్సెక్స్‌ 53 పాయింట్లు లాభపడి 36,374వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు లాభంతో 10,905 వద్ద స్దిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.11గా కొనసాగుతుంది.