స్వల్ప మార్పులతో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు

ind vs aus
ind vs aus

మెల్‌బోర్న్‌: ఇండియా, ఆస్ట్రేలియాలు తుది సమరానికి సిద్ధమవుతున్నాయి. శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరగబోయే మూడే వన్డేతో ఆస్ట్రేలియాలో టీమిండియా టూర్‌ ముగియనుంది. ఆసీస్‌ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ విజయంతో టూర్‌ను ఘనంగా ముగించాలని కోహ్లి సేన భావిస్తున్నది. రెండో వన్డే ఆడిన టీమ్‌లో రెండు మార్పులతో ఆస్ట్రేలియా బరిలోకి దిగుతున్నది. సీనియర్‌ స్పిన్నర్‌ నేథన్‌ లయన్‌ స్థానంలో ఆడమ్‌ జంపా, జేసన్‌ బెహ్రన్‌డార్ఫ్‌ స్థానంలో బిల్లీ స్టాన్‌లేక్‌ టీమ్‌లోకి వచ్చారు. అటు టీమిండియాలో ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తున్నది. రెండో వన్డే ఆడిన పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ స్థానంలో విజ§్‌ు శంకర్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.