స్వల్పలాభాలతో ముగిసిన మార్కెట్లు

BSE
BSE

స్వల్పలాభాలతో ముగిసిన మార్కెట్లు

ముంబై, నవంబరు 28: ఈ వారం కీలక స్థూల ఆర్థిక గణాంకాలు వెలువడ నున్న నేపథ్యంలో వ్యాపారులు ఆచితూచి పెట్టుబడులు పెట్టడంతో సోమ వారం దేశీయ మార్కెట్లు స్వల్పలాభాలతో ముగిసాయి. ఒకదశ లో మార్కెట్లు నష్టాల బాటలో సాగినప్పటికీ చివరిలో కొన్ని ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో తిరిగి లాభాల్లో ముగిసాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 45.2పాయింట్ల లాభంతో ముగి యగా, నిఫ్టీ సైతం దాదాపు 10పాయింట్ల లాభంతో ముగిసిం ది. బిఎస్‌ఇలోని వివిధ రంగాల సూచీల్లో రియల్టీ సూచి అత్యధి కంగా 1.24శాతం వృద్ధి చెందగా, విద్యుత్‌, మౌలిక సదుపా యాలు, గృహోపకరణాల రంగాల సూచీలు సైతం బాగానే లాభపడ్డాయి. మరోవైపు మెటల్‌, ఐటి, ఎఫ్‌ఎంసిజి, చమురు గ్యాస్‌రంగాల సూచీలు నష్టపో యాయి

సెన్సెక్స్‌లోలాభపడిన కంపెనీలు ఎన్‌టిపిసిఅత్యధికంగా 3.13శాతం వృద్ధిచెందగా, యాక్సిస్‌బ్యాంకు, ఒఎన్‌జిసి, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ఇండియా, విప్రో షేర్లు సైతం లాభాలు పొందిన వాటిలో ఉన్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్‌ షేరు 1.23శాతం నష్టపోగా, టాటామోటార్స్‌, అదాని పోర్ట్స్‌, టాటాస్టీల్‌, బజాజ్‌ ఆటో కూడా బాగానేనష్టపోయాయి.

ఫలితంగా బిఎస్‌ఇ సెన్సెక్స్‌ ఒకదశలో 0.5శాతం దాకా నష్టపోయినప్పటికీ చివరికి 45 పాయిం ట్ల వృద్ధితో 33,724.44పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 9.85పాయింట్లు వృద్ధిచెంది 10,399.55 పాయింట్ల వద్ద ముగి సింది. స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ భారత సావరిన్‌ రేటింగ్‌ను యధా తథంగా కొనసాగించడం మార్కెట్‌ వర్గాలను కొంత అసంతృప్తికి గురిచేసినప్పటికీ దానిప్రభావం నుంచి బయట పడినట్లు కనిపిస్తోం దని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

ఆసియా మార్కెట్లు సైతం ప్రారంభంలో ఓ మోస్తరు లాభాల్లో కొనసాగినప్పటికీ చివరికి ఆ లాభాలను కోల్పోయి బలహీనంగా ముగిసాయి. చైనా, దక్షిణకొరియా మార్కెట్లు ఓ మోస్తరు నష్టాల్లో ముగిసాయి. మరోవైపు ఐరోపా మార్కెట్లలో మిశ్రమస్పందన కనిపించింది.