స్వర్ణాలు సాధించిన మేరీకోమ్‌, జ్యోతి

MARRY KOM1
MARRY KOM1

స్వర్ణాలు సాధించిన మేరీకోమ్‌, జ్యోతి

మరో అంతర్జాతీయ వేదికపై భారత బాక్సర్లు సత్తా చాటారు. ఫేవరె ట్‌గా బరిలోకి దిగిన భారత స్టార్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ స్వర్ణాన్ని దక్కించుకుని సత్తా చాటింది. ఇంటర్నేషనల్‌ సిలెసియన్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ పోటీల్లో మేరీకోమ్‌తో పాటు మరో బాక్సర్‌కు పసిడి లభించింది. పోలెండ్‌లోని గ్లివైస్‌ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో భారత్‌ బాక్సర్లు అదరగొడుతున్నారు. మేరీకోమ్‌కి ఈ ఏడాది ఇది మూడో స్వర్ణం.

ఇప్పటికే ఇండియా ఓపెన్‌, గోల్డ్‌ కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు గెలిచింది మేరీకోమ్‌. ఇప్పటికే టీమిండియా ఖాతాలో 13 మెడల్స్‌ చేరడం విశేషం. వాటిల్లో ఆరు స్వర్ణాలున్నాయి. 48 కిలోల కేటగిరీలో జరిగిన ఫైనల్లో కజకిస్తాన్‌ బాక్సర్‌ ఐజెరిమ్‌ కస్సనయెవాతో తలపడిన మేరీకోమ్‌ 5-0తేడాతో చిత్తు చేసి గోల్డ్‌ కైవసం చేసుకుంది. మేరీకోమ్‌తో పాటు జ్యోతి గులియా 51కేజీల కేటగిరీలో స్వర్ణం సాధించింది. సెమీఫైనల్‌ చేరిన మరో బాక్సర్‌ సరితా దేవి 60కేజీల కేటగిరీలో కాంస్య పత కంతోసరిపెట్టుకుంది. కజకిస్తాన్‌ బాక్సర్‌ కరినా ఇబ్రాగిమోవాతో 0-5చిత్తుగా ఓడింది సరితాదేవి. అయితే తన ఓటమిని అంగీకరిం చలేదు సరితాదేవి. అంపైర్ల తప్పుడు నిర్ణయం కారణంగానే సరితా దేవి ఓడిపోయిందని ఆమె టీం కోచ్‌ ఆరోపించారు.

యూత్‌ కాంపిటేషన్స్‌ లో జ్యోతి గులియా పోలాండ్‌కి చెందిన తాతి యానా పుల్టాను రెండు రౌండ్లలో చిత్తుగా ఓడించి గోల్డ్‌ సాధించింది. పోలెండ్‌ బాక్సర్లపై పూర్తి ఆధిపత్యం కనబర్చిన 17ఏళ్ల జ్యోతిగు లియా కొద్దిసేపట్లోనే మట్టికరిపించింది. సెమీస్‌ చేరిన భారత బాక్సర్లు లోవ్‌లినా బోర్గోహెయి న్‌, పూజా రాణి…ఫైనల్‌ చేరడంలో విఫలమై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. లోవ్‌ లినా ఓటమికి కూడా అంపైర్ల తప్పుడు నిర్ణయ మే కారణమని ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.