స్వయంగా తెలుగులో డబ్బింగ్

Aditi Rao Hydari Latest Photos12
Aditi Rao Hydari

సుధీర్ బాబు హీరోగా ‘సమ్మోహనం’ అంటూ మరో డిఫరెంట్ మూవీతో రాబోతున్నాడు ఇంద్రగంటి. రీసెంటుగా ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది. ఈ టీజర్ చూసిన వారికి హీరోయిన్ అదితి రావ్ హైదరి వాయిస్ వినగానే… హీరోయిన్ నిత్యామీనన్ గొంతే గుర్తుకు వచ్చింది. అచ్చం నిత్యామీనన్ లా పదాలను విడగొడుతూ మాట్లాడింది అదితి. దాంతో అదితి కోసం నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పిందేమో అనుకన్నారంతా. అయితే ఈ వార్తలు ఎక్కువ కావడంతో స్వయంగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ స్వయంగా స్పందించి… నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పలేదని స్పష్టం చేశారు. ‘టీజర్ చూసిన వాళ్లంతా అదితి రావు పాత్రకి నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పిందేమో అని పొరబడుతున్నారు. నిజానికి అదితిరావు స్వయంగా తెలుగులో తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంది’ అని చెప్పారాయన.