స్వప్నం సాకారమైంది: సింధు

444
స్వప్నం సాకారమైంది: సింధు

హైదరాబాద్‌: ఒలింపిక్స్‌లో సాధించిన విజయం కలలా ఉందని రియో ఒలింపిక్స్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో రజత పతకం సాధించిన సింధు పేర్కొన్నారు.హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ గోపిచంద్‌ అకాడమీలో కోచ్‌ గోపీచంద్‌తో పాటు ఆమె విలేకరులతో మాట్లాడుతూ తనకు కోచ్‌ గోపిచంద్‌,తల్లి దండ్రుల ప్రొత్సాహం ఎంతో ఉందని ఆమె ఈ సందర్బంగా వెల్లడించారు.ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఒక గొప్ప విషయని అలాంటిది పతకం సాధించడంతో ఆ సంతోషం మరింత పెరిగిందన్నారు.ఒలింపిక్స్‌లో గెలువడంతో తన స్వప్పం సాకారమైనట్లుగా భావిస్తున్నానని సింధు వివరించారు.మహిళలకు వారి తల్లిదండ్రలు సహకారం ఎంతో అవసరమని తాను భావిస్తున్నట్లు సింధు పేర్కొంది.క్రీడల్లో ముందుకు దూసుకెళ్లాటంటే తల్లిదండ్రుల సహకారం కావాలని ఒలంపిక్స్‌కు రెండు నెలల ముందు నుంచే కష్టపడినట్లు సింధువివరించింది.కాగా మెరుగైన ఆట తీరు ప్రదర్శించేందుకు ప్రణాళిక రూపొందించుకొని సాధన చేసినట్లు ఆమె వెల్లడించారు.తనకు కోచ్‌ మద్దతు ఎంతగానో ఉందని సింధు పేర్కొన్నారు.తన సీనియర్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ను కొనియాడింది.దేశం కోసం సైనా నెహ్వాల్‌ కష్టపడిందని గుర్తు చేసింది.భారత బ్యాడ్మింటన్‌కు సైనా నెహ్వాల్‌ సేవ ఎంతో గొప్పదని ఆమె ప్రశంసించింది.కాగా గోపిచంద్‌ అకాడమీలో అన్ని వసతులు ఉన్నాయని ఆమె పేర్కొంది.గోపిచంద్‌ తనకు అత్యుత్తమ శిక్షణనందించారని సింధు వివరించింది.స్వదేశం చేరుకున్న తనను ప్రభుత్వం ఘనంగా సత్కరించడం ఆనందాన్ని కలిగించిందని పేర్కొంది.ఫైనల్‌ మ్యాచ్‌ ముగియగానే ప్రత్యర్థి మారిన్‌ను తాను అభినందించినట్లు సింధు వెల్లడించింది. సింధు బంగారు పతకం సాధిస్తుంది: గోపిచంద్‌ భవిష్యత్తులో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సింధు ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తుందని ఆమె కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ ధీమా వ్యక్తం చేశాడు. కాగా రియో ఒలింపిక్స్‌ కోసం సింధు ఎంతగానో కష్టపడిందన్నాడు.సింధు ప్రతిరోజు తెల్లవారు జామునే అకాడమీకి వచ్చి సాధన చేసేదన్నాడు.ఇప్పుడు పెద్ద వేదికపై అవసరమై విధంగా ఆటతీరును ప్రదర్శించి ఆమె విజేతగా నిలిచిందని ప్రశంసించాడు.సింధు విజయం కొత్త క్రీడాకారులకు ఎంతగానో ఉత్సాహానిస్తుందని గోపీచంద్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.సింధు ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమెతల్లి దండ్రుల కృషిని గోపిచంద్‌ అభినం దించాడు. సింధును తెల్లవారు జామునే అకాడమీకి తీసుకొచ్చేందుకు రమణ ఉద్యోగానికి సెలవుపెట్టాడని, ఆమె తల్లి ఉద్యోగ విరమణ చేశారన్నాడు. సింధు అకాడమీకి చెప్పిన సమయానికి వచ్చేదని,ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.సింధు మూమ్మాటికి ఇండియన్‌ అని హర్షం ధ్వానాల మధ్య ప్రకటించారు. కాగా రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అమ్మాయిలు సింధు, సాక్షిమాలిక్‌ దేశానికి గర్వకారణంగా నిలిచారని గోపి చంద్‌ పేర్కొన్నాడు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ఎంతగానో ప్రోత్స హిస్తుందన్నాడు. కరణం మల్లీశ్వరి స్ఫూర్తితోనే తాను ఒలింపిక్స్‌లో పతకం తేవాలని ఆశించించానని, ఒలింపిక్స్‌లో తానుపతకం సాధించలేక పోయినా, సింధు ద్వారా తనకల నెరవేర్చుకున్నానని వెల్లడించాడు. ప్రభుత్వ ప్రొత్సా హంతో భవిష్యత్‌లో మరింతమందిక్రీడాకారులను తయారు చేసేందుకు కృషిచేస్తానని గోపిచంద్‌ పేర్కొన్నాడు.