స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా

prakash raj

prakash raj                                                                                                                                                 బెంగళూర్‌:ప్రముఖ దక్షిణాది నటుడు ప్రకాష్ రాజ్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగుతానని, కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. తన ఈ కొత్త ప్రయాణానికి మద్దతుగా నిలుస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని, అన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలియజేస్తానని పేర్కొన్నారు. కాగా, ‘సిటిజన్ వాయిస్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక దృక్పథాన్ని చాటుతున్న ప్రకాష్ రాజ్, ‘జస్ట్ ఆస్కింగ్’ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఓ పౌరుడిగా ఆయన తరచుగా ప్రశ్నలు సంధిస్తున్న విషయం తెలిసిందే.