స్మిత్‌ సెంచరీ, ఆస్ట్రేలియా 327/5

s6
Smith

స్మిత్‌ సెంచరీ, ఆస్ట్రేలియా 327/5

న్యూఢిల్లీ: ఇండియా-ఎతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సెంచరీతో చెలరేగాడు.55 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడిన ఆస్ట్రేలియాను షాన్‌ మార్ష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.ఈ క్రమంలోనే స్మిత్‌ సెంచరీ చేయగా,మార్ష్‌ కూడా సెంచరీ సాధించాడు.స్మిత్‌ జోరుకు షాన్‌ మార్స్‌ తోడుకావడంతో కంగారూల స్కోరు బోర్డు పరు గులు పెట్టింది.వీరిద్దరు మూడవ వికెట్‌కు అత్యధి కంగా 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 167 బంతులు ఆడి 12 బౌండరీలు,1 సిక్సర్‌ సాయంతో 107 పరుగులు చేసిన అనంతరం స్మిత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. మార్ష్‌ కూడా రిటైర్డ్‌ హర్ట్‌ ప్రకటించాడు.ఈ ఇద్దరు 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో తొలి రోజు టి విరామ సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 211పరుగులు చేసింది.స్మిత్‌ 107 పరు గులు, షాన్‌ మార్ష్‌ 104 పరుగులు చేశారు. దీంతో ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 25 పరుగులు,మరో ఓపెనర్‌ రెన్‌ షా 11 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరారు.

భారత బౌలర్‌ షైని ఆదిలోనే ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. 8.4 ఓవర్‌ వద్ద 33 పరుగులకే వార్నర్‌ను ఔట్‌ చేసిన షైని ఆ తరువాత 16.1వ ఓవర్‌ వద్ద రేన్‌షాను 11 పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపాడు.నాలుగు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ¶ి కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో ముంబైలోని బ్రాబోర్న్‌ స్టేడియంలో ఆరంభమైన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇండియా ఎ జట్టు ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌ చేయాల్సిందిగా కోరింది. ఇండియా ఎ జట్టుకు పాండ్యా కెప్టెన్‌గా వ్యవహ రిస్తున్నాడు.దీంతో పాండ్యా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా లంచ్‌ విరామ సమయానికి 24 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్మిత్‌ 31 పరుగులు, షాన్‌ మార్ష్‌ 6 పరుగు లతో క్రీజులో ఉన్నారు.ఇదిలా ఉంటే ఫిబ్రవరి 23 నుంచి జరిగే తొలి టెస్టు కోసం ఏకైక సన్నాహక మ్యాచ్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

ఇందులో టీమిండియా ఎ జట్టు రంగంలోకి దిగగా ఆస్ట్రేలియా మాత్రం పూర్తి స్థాయిలో బరిలోకి దిగింది. మరోవైపు భారతజట్టు తమ రిజర్వ్‌ బెంచ్‌ సత్తాను పరీక్షించ నుంది. పరిమిత ఓవర్ల ఆటగాడిగా పేరున్న హార్థిక్‌ పాండ్యా ఈ మధ్య కాలంలో మెరుగ్గా ఆడుతు న్నాడు. ఈ మ్యాచ్‌లో సత్తా చాటితే ఆసీస్‌తో తొలి రెండుటెస్టుల కోసం తుది జట్టుకు కోచ్‌ కుంబ్లే, కప్టెన్‌ కోహ్లీ అతడిని పరిగణలోకి తీసుకునే అవకా శముంది. మరోవైపు హాజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌ వంటి నాణ్యమైన బౌలర్ల బౌలింగ్‌లో తమను తాము పరిక్షించుకోవడానికి ఇండియా ఎ ఆటగాళ్ల కు ఇదే చక్కని అవకాశం. జూనియర్‌ ప్రపంచ కప్‌ టీమిండియాకు నాయకత్వం వహించిన కిషన్‌ను ఈ మ్యాచ్‌కు వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. శ్రేయస్‌ అయ్యర్‌, అఖిల్‌ హెర్వాద్కర్‌ కూడా ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని భావిస్తున్నారు. గత రంజీ సీజన్‌లో 1300 పైగా పరుగులు చేసిన అయ్యర్‌ ఈసారి మాత్రం సత్తా చాటలేదు.ఇక ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర బ్యాట్స్‌మెన్‌ అంకిత బాన్నే మిడిల్‌ ఆర్డర్‌గా బరిలోకి దిగనున్నాడు. టీమిండియా: హార్థిక్‌ పాండ్యా(కెప్టెన్‌),అఖిల్‌ హెర్వ డ్కర్‌,ప్రియాంక్‌ కీర్తి పంచల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, అంకిత్‌ బన్నే,రిషబ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, సెహాబాజ్‌ నదీమ్‌,క్రిష్ణప్ప గౌతమ్‌,కుల్దీవ్‌ యాదవ్‌, నవ్‌దీప్‌ షైనీ,అశోక్‌ దిండా,మహ్మద్‌ సిరాజ్‌, రాహుల్‌సింగ్‌. ఇంద్రజిత్‌. ఆస్ట్రేలియా: స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌),డేవిడ్‌ వార్నర్‌,అస్టోన్‌ అగర్‌,జాక్సర్‌ బర్ల్‌,పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌,జోష్‌ హాజల్‌వుడ్‌,ఉస్మాన్‌ఖవాజా, నాథన్‌ లియాన్‌, మిచెల్‌ మార్ష్‌, షాన్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, స్టీఫెన్‌ ఓకీఫ్‌, మాథ్యూ రెన్షా, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌, మాథ్యూవేడ్‌.