స్మిత్‌ ఎట్‌ దుబాయ్‌

Steve Smith
Steve Smith

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో జట్టు కెప్టెన్‌గా స్థానం కోల్పోవడం కాకుండా ఏడాది పాటు ఆసీస్‌ జట్టుకి ప్రాతినిధ్యం వహించకుండా నిషేధానికి గురైన స్మిత్‌ ఎవరికీ చెప్పపెట్టకుండా దుబాయ్‌ వెళ్లిపోయాడు. స్మిత్‌ ఎప్పుడు స్వదేశానికి తిరిగి వస్తాడన్న దానిపై ఎటువంటి సమాచారం లేదు. ఇదే వివాదంలో ఏడాది నేషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా జట్టు మాజీ వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్న్‌ తాను ఇక ఆస్ట్రేలియా తరపున క్రికెట్‌ ఆడే అవకాశం లేకపోవచ్చని ప్రకటించిన విషయం విదితం.