స్మిత్‌ను ఢీకొన్న బెన్‌ స్టోక్స్‌

SMITH
SMITH

స్మిత్‌ను ఢీకొన్న బెన్‌ స్టోక్స్‌

న్యూఢిల్లీ: ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి షాకిచ్చింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనం తరం 156 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన పుణే 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులతో కోల్‌కతాపై నెగ్గింది.అయితే ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఓ షాకింగ్‌ ఘటన జరిగింది.

బౌండరీ వద్ద కెప్టెన్‌ స్మిత్‌,అల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ఢీకొన్నారు. దీంతో స్మిత్‌ కొద్దిసేపు విలవిల్లాడి పోయాడు. మైదానంలో అంతకు ముందులాగా కదల్లేక పోయాడు. మ్యాట్‌ తీసుకురావాలని బెన్‌ స్టోక్స్‌ ఫిజియోను పిలిచినా కష్టమ్మీద స్మిత్‌ నడుచు కుంటూ వెళ్లిపోయాడు.ఈ సంఘట పుణే బౌలర్‌ జయదేవ్‌ ఉనాద్కత్‌ వేసిన 19వ ఓవర్‌లో చోటు చేసుకుంది.19వ ఓవర్‌కు చెందిన 5వ బంతిని కోల్‌కతా ఆటగాడు కోల్టర్‌ నైల్‌ భారీ షాట్‌ ఆడాడు.బౌలర్‌ అవతలపడే బంతిని ఎలాగైనా ఆపాలని, వీలైతే క్యాచ్‌ పట్టాలని స్మిత్‌ ప్రయత్నించాడు.అదే సమయంలో బెన్‌స్టోక్స్‌ కూడా బంతిని ఆపాలని పరుగెత్తుకుంటూ బౌండరీ లైన్‌ వద్దకు వచ్చాడు.

ముందుగా స్టోక్స్‌ తన చేతిలో పడిన బంతిన గాల్లోకి విసురుతూ బౌండరీ లైన్‌ దాటాడు. అయితే ఈ క్రమంలో స్టోక్స్‌ గట్టిగా తగలడంతో బౌండరీ లైన్‌ అవతల ఉన్న సైన్‌ బోర్డుకు స్టీవ్‌ స్మిత్‌ తల గుద్దుకుంది.వెంటనే స్టోక్స్‌ ఫిజియోని రమ్మని పిలిచాడు.ఇంతలో స్మిత్‌ కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు.ఫిజియో వచ్చినా స్మిత్‌ ఎవరి సాయం లేకుండా నొప్పి ఉన్నా అలాగే నడుచుకుంటూ వెళ్లిపోయాడు.ఆ తరువాత బ్యాటింగ్‌లో కొంత ఇబ్బంది పడినట్లు కనిపించాడు