స్మిత్‌కు చేదు అనుభవం

జొహన్నెస్బర్గ్ః బాల్ టాంపరింగ్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) చేపట్టిన విచారణ ముగియడంతో స్మిత్ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి బయలుదేరాడు. ఈ నేపథ్యంలో జొహానెస్బర్గ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న స్మిత్‌ను అక్కడ అభిమానులు స్మిత్‌ను చూసి ‘చీట్..చీట్’ అంటూ హేళన చేశారు.