‘స్మార్ట్‌ సేవలకు ఆర్‌జియో కొత్త నిర్వచనం!

JIO
rjio

‘స్మార్ట్‌ సేవలకు ఆర్‌జియో కొత్త నిర్వచనం!

 

ముంబై, నవంబరు 20: రిలయన్స్‌ ఎక్స్‌పీరియర్స్‌ సెంటర్‌ సేవలతో ఆర్‌జియో టెలికాంసేవలకు కొత్త నిర్వచనం ఇస్తోంది. రిలయన్స్‌ ఎక్స్‌ పీరియన్స్‌ సెంటర్‌తో కనెక్ట్‌ అయితే చాలు కస్టమర్లు నివసించే సిటీ స్మార్ట్‌సిటీ అయినా కాకపోయినా జియోసిమ్‌ యజమానులు మాత్రం స్మార్ట్‌సిటిజన్‌గా మారతారని జియో ధీమా. ఆర్‌జియో కనెక్షన్‌ఉన్న వినియోగదారుడు ఏనగరం లో అయినా సరే సకలసౌకర్యాలతో స్మార్ట్‌సిటి జెన్‌ జీవనశైలి అలవరుచుకుంటారు. జియో సిమ్‌ కార్డతో 4జి మొబైల్‌పై అత్యధికవేగంతో డేటాసేవలు అందుతాయి. ఇల్లు ఆఫీసు, టివిలేదా కారు ఇష్టమైన దినపత్రిక ఏవైనా సరే ఒక్క స్మార్ట్‌ఫోన్‌పై ఒకసారి టచ్‌చేస్తే చాలు అన్నీ కళ్లముందుకు వస్తాయని ఆర్‌ జియో ఎక్స్‌పీరియా సెంటర్‌నిపుణులు చెపు తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రిల యన్స్‌ ఈ కేంద్రాన్ని ముంబైలోని రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్క్‌లో నెలకొల్పింది. ఈకేంద్రంలో ఎంపికచేసిన కస్టమర్లు, వెండాలర్ల సమక్షంలో జియో డిజిటల్‌ ప్రపంచానికి మరింత చేరువ అవుతోంది. ఇటీవలే హైదరాబాద్‌ నుంచి వచ్చిన మీడియా బృందానికి లైవ్‌డెమోద్వారా ఈ సెంటర్‌కు సంబంధించిన అన్ని విశేషాలను వివరించారు. బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌ అప్లికేషన్లు, ఇతర సేవలు గురించి విశదీకరించారు. జియో ఏవిధంగా జనావాసాలు ఇళ్లు, కార్యాలయాలు, ఉపకరణాలు వాహనా లతో కనెక్ట్‌ అవుతుందనే అంశాన్ని సమగ్రంగా ఆర్‌జియోరాకతో రూపురేఖలే మారిపోతాయని టివిహెచ్‌డిటివి, మొబైల్‌టివి, వైఫైసెట్‌ టాప్‌బాక్స్‌,మైఫై వంటివన్నీ కూడా కేవలం మొబైల్‌పై అందుబాటులోనికి వస్తున్నాయి.
ఇతర ఫోన్లలో ఉన్న అనుభవాల రూపురేఖలే మారిపోయాయి.జియోసిమ్‌ అప్‌, డివైజెస్‌తో పరికరాలు ఇతర సామగ్రి పూర్తి మార్పును తెచ్చాయి. ఇక జియో వీడి యో అప్లిపకేషన్ల ద్వారా ఎంత పెద్ద వీడియోలనైనా ఏమాత్రం జాప్యంలేకుండా క్షణకాలంలో డౌన్‌లోడ్‌చేసు కునే సౌకర్యం ఉంది. జియో మ్యూజిక్‌ ద్వారావేలాది పాటలు భద్రపరుచుకునేందుకు వీలుగా ఒక స్టోర్‌ సదుపాయం ఉంది. ఇక జియో న్యూస్‌ మ్యాగ్‌జైన్‌ అప్లికేషన్లద్వారా వార్తలుచదువు కోవచ్చు. క్రీడా, సినిమా విభాగాలకు నేరుగా పోవచ్చు. జియోటివి ద్వారా మొత్తం ఛానెళ్లు, జియో సినిమాద్వారా వేలాది సినిమాలు, జియో మనీద్వారా బిల్లుల చెల్లింపులు ఒకటేమిటి సర్వస్వం ముందుకు తెస్తోంది. వన్‌జిబి పిఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను అమలు చేస్తోంది. ఫైబర్‌టుది హోం ఎఫ్‌టిటిహెచ్‌గా పిలిసే సర్వీసుతో ఇళ్లు, ఆఫీసులకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ఇస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్త కేబుల్‌ ఏర్పాటయిందని వీటితోపాటు ఒక ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌బాక్స్‌ కూడా అందిస్తుంది. చేతిలో పట్టేసే జియోఫై రూ.2 వేలతో సమకూర్చుకుంటే ఇంటిని మొత్తం వైఫై గా మార్చేస్తుంది. ఇక జియో మీడియా షేర్‌ ద్వారా డేటాను ఇళ్లలోని వివిధ డిజిటల్‌ పరి కరాల మధ్య మార్పిడిచేసుకునే వీలుంది. జియో మీడియాషేర్‌యాప్‌ ఒకేసారి ఐదు ఉపకరణాలకు పనిచేసే వీలుంటుంది. రెండుల్యాప్‌ టాప్‌లు, ఒక డెస్క్‌టాప్‌, మొబైల్‌ ఏకకాలంలో కనెక్ట్‌ అయిపోతా యి. ఇంటర్నెట్‌ ఆధారంగాపనిచేసే సెక్యూ రిటీ సిస్టమ్స్‌, మోషన్‌ సెన్సార్స్‌ కెమేరాతో కూడిన డోర్‌బెల్స్‌, స్పీకర్లు, ఫైర్‌డిటెక్టర్లను కూడా సమకూర్చి ఒక స్మార్ట్‌హోం నిర్మాణ విధానానికి ఆర్‌జియో శ్రీకారం చుడుతోంది. భవి ష్యత్తులో వాడుకునేకార్లను స్మార్ట్‌కార్లుగా రూపొందించే విధంగా డిజిటల్‌ టెక్నాలజీతో ఆర్‌జియో కొత్తపుం తలు తొక్కు తోందనే చెప్పాలి. మొత్తం మీద టెలికాం, వాయిస్‌ మొబైల్‌ డేటా సేవల్లో ఆర్‌జియో కొత్త శకానికి తెరతీసిందనడంలో సందేహంలేదు.