స్మార్ట్‌ఫోన్‌ ఆప్స్‌తో ఒత్తిడి మటాష్‌

smart phone
smart phone

స్మార్ట్‌ఫోన్‌ ఆప్స్‌తో ఒత్తిడి మటాష్‌

టచ్‌స్క్రీన్‌ సెల్‌ఫోన్లు వచ్చాక, వీటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వృద్ధులు మొదలుకొని, చంటిపిల్లలతోసహా అందరూ వీటినే వాడుతున్నారు.తద్వారా ఫోన్లు అధికంగా వాడితే ఆరోగ్యానికి మంచిది కాదని, మెదడు, వెన్నెముకకు సమస్య అంటూ వైద్యులు తమ పరిశోధనల ద్వారా హెచ్చరిస్తున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్‌ ఆప్స్‌ వాడకం వల్ల డిప్రెషన్‌ నుండి విడుదల పొందవచ్చని, తాజా అధ్యాయానలు వెల్లడిస్తున్నాయి.

కుంగుబాటు నుంచి సామాజిక మాధ్యమాలు కాపాడుతున్నాయని ఆస్ట్రేలియా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో పోస్ట్‌ డాక్టరల్‌ రీసెర్చరర్‌గా ఉన్న జోసెఫ్‌ ఫ్రిత్‌ వెల్లడించారు. సామాజిక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవ్ఞతున్న కోట్లాది ప్రజలు కుంగుబాటుకు గురవ్ఞతున్నారని, ఇలాంటి వారంతా తమ సామాజిక మాధ్యమాల వాడకం వల్ల బయటపడతున్నారని, ఇది వారికి చికిత్సను అందించే పరికరంగా మారిందని ఫ్రిత్‌ చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ ఆప్స్‌ వల్ల డిప్రెషన్‌, ప్రవర్తనా లోపాలకు ఆప్స్‌ థెరపీగా ఉపయోగపడుతున్నది ఆయన పేర్కొన్నారు. ఆప్స్‌ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌గా పనిచేస్తున్నదని అన్నారు. ఆలోచనావిధానాలను ఆరోగ్యకరంగా ఉంచుకునేందుకు, ఆత్రుత, భయం వంటి భావోద్రేకాలను అదుపులో వ్ఞంచుకునేందుకు స్మార్ట్‌ఫోన్‌ ఆప్స్‌ ఉపయోగపడుతున్నదని జోసెఫ్‌ ఫ్రిత్‌ వివరించారు.