స్పెషల్‌ సాంగ్‌ చేయనున్న స్వీటీ

Anushka1
Anushkha

స్పెషల్‌ సాంగ్‌ చేయనున్న స్వీటీ

ఇన్నాళ్లు దక్షిణాది స్టార్‌హీరోయిన్లలో ఒకరిగా కొనసాగిన ఆనుష్క బాహుబలి-2 ఘన విజయం తర్వాత జాతీయస్థాయి హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.. దీంతో ఆమె తర్వాతి ప్రాజెక్టుల విషయంలో అందరిలోనూ కుతూహలం నెలకొంది.. ప్రస్తుతం భాగమతి చిత్రంలో నటిస్తున్న ఆమె త్వరలో ఒక స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేయనున్నట్టు వార్తలు విన్పిస్తున్నాయి.. అదికూడ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు చేస్తున్న ‘భరత్‌ అనే నేను చిత్రంలో కావటం విశేషం.. ఈ మేరకు ఆమెతో చర్చలు జరిగాయని, కథతో పాటు పాటకు కూడ ప్రాముఖ్యత ఉండటంతో అనుష్క, ఈ ఆఫర్‌ పట్ల సుముఖంగానే ఉన్నారని అంటున్నారు.. అయితే ఈ విషయంపై ఇంకా పూర్తి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.. కొరటాల శివ డైరెక్టు చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.