స్పర్థలు వచ్చినా సర్దుకుపోవాలి

వ్యధ

(ప్రతి గురువారం)

LONELY
Lonely

స్పర్థలు వచ్చినా సర్దుకుపోవాలి

ప్రతిభర్త తన భార్య సీతలాగా ఉండాలనుకుంటారు. అయితే అలా కోరుకునే వారిలో చాలామంది శ్రీరామునిలా వ్ఞండలేకపోతున్నారు. ప్రతి భార్య తన భర్త తనకే సొంతం కావాలని కోరుకుంటున్నా స్పృహకోల్పోయి ప్రవర్తిస్తుంటారు. దారి తప్పుతున్న భర్తను నిలదీసే భార్యను అణచివేసేందుకు ప్రయత్నిస్తారు. పెద్దలకు చెబితే మగాడుకదా? చిన్నచిన్న తప్పులు చేసినా సర్దుకుపోవాలంటూ హితోపదేశాలు చేస్తారు. అదే ఆడది తప్పు చేస్తే భర్తలు భరిస్తారా అన్న ప్రశ్నవేస్తే బరితెగించిందంటూ నిందలు వేస్తారు. బాగా చదువ్ఞకుని, ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న నేను నా భర్తను దారిలో పెట్టలేకపోతున్నాను. ఆయన వివాహేతర బంధాన్ని ప్రశ్నించినందుకు విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నారు. నా కథనం చదివి తగిన పరిష్కారం చెప్పండి. నా వయస్సు 30 ఏళ్లు. బి.ఎస్సీ నర్సింగ్‌ చేసి ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాను.

ఐదేళ్ల క్రితం డిగ్రీ చదివి ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. మొదటి ఏడాది ఇద్దరం చాలా అన్యోన్నంగా సంసారం సాగించాం. మా ప్రేమకు ప్రతిఫలంగా ఎడాదిన్నరకంతా ఒక ఆడపిల్లకు తల్లినయ్యాను. అప్పటి నుంచి నా భర్తలో మార్పు ప్రారంభమయ్యింది. నాపట్ల ప్రేమ, అనురాగం తగ్గుతుండటాన్ని గుర్తించాను. ఉద్యోగపు ఒత్తిళ్లు, తీరకలేని పనుల వల్ల ముందులా ఉండలేకపోతున్నాడని సరిపెట్టుకున్నాను. సర్దుకుని సంసారం చేయడం ప్రారంభించాను. అలా రెండేళ్లు గడిచేసరికి మళ్లీ ఒక ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి పూర్తిగా నన్ను విస్మరించడం ప్రారంభించాడు. రాత్రులు ఆలస్యంగా రావడం, అలసిపోయానంటూ నిద్రపోవడం చేసేవాడు.

కొన్నాళ్లకు పిల్లల ఏడుపు వల్ల నిద్రపట్టడం లేదంటూ మరొక గదిలో పడుకోవడం ప్రారంభించాడు. నేను కూడా పెద్దగా పట్టించుకోకుండా పిల్లలతో గడపడం ప్రారంభించాను. 6నెలల క్రితం ఒకరోజు అర్ధరాత్రి పక్క గదిలో ఏవో మాటలు వినిపిస్తుంటే లేచి చాటుగా గమనించాను. ఆయన ఎవరితోనే సరస సంభాషణలు సాగిస్తున్నాడు. అనుమానం వచ్చి ఉదయం త్వరగా లేచి మా వారి గదిలోకి వెళ్లి సెల్‌ఫోన్‌ కాల్‌డేటా, వాట్సాప్‌ సంక్షిప్త సమాచారాన్ని పరిశీలించాను. మా వారితో పాటు పనిచేసే ఒక అమ్మాయితో 2 గంటల సేపు చాటింగ్‌ చేసి వ్ఞండటాన్ని గుర్తించాను. కొత్త ప్రేమికుల లాగా వ్యవహరించిన వారి తీరు చూసి జుగుప్స కలిగింది. ఇక వ్ఞండబట్టలేక ఆయన్ను నిలదీశాను.

దానికి రకరకాల సాకులు చెప్పాడు. ఆమెకు భర్త లేడని, డిప్రెషన్‌లో వ్ఞందని, ఏవో మాటలు చెప్పి, సేద తీరుస్తున్నానని చెప్పుకొచ్చాడు. నాకు ఇష్టం లేకుంటే ఇక నుంచి మానేస్తానని ప్రమాణం చేశాడు. అయితే ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. కొన్నాళ్లు నిరీక్షించిన అనంతరం నిలదీశాను. ‘నేను మగాడిని, నా ఇష్టం, నిన్ను చూస్తే మూడు రావడం లేదు, నా వ్యవహారం నచ్చకుంటే విడాకులు తీసుకో అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడారు. పెద్దల దృష్టికి తీసుకెళితే అందరూ నన్నే సర్దుకోమంటూ సలహాలు ఇస్తున్నారు.

ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక డిప్రెషన్‌కు గురవ్ఞతున్నాను. నా భర్తను మార్చుకొనే మార్గం వ్ఞందా? లేక విడాకులు తీసుకొని బ్రతకడం మంచిదా? చెప్పగలరు.
-సంగీత, శ్రీకాకుళం

ఆధునిక సమాజంలో పలువురు యువతీ యువకులు సాంఘిక మాధ్యమానికి బానిసలవ్ఞతున్నారు. అలాగే నైతిక విలువలు, అనుబంధాలను విస్మరిస్తున్నారు. చిన్నచిన్న వ్యామోహాలకు ఆకర్షితులై వివాహబంధాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. వివేకం మరచి వివాహేతర బంధాలకు ఆర్రులు చాసి, అబాసుపాలవ్ఞతున్న వారు నిత్యం వార్తలకెక్కుతున్నారు. అడ్డదారి ప్రేమలు, అక్రమ సంబంధాలు వికటించి హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిని మనం చూస్తున్నాం. అలాగే మీ భర్త కూడా దారితప్పి ప్రవర్తిస్తున్నాడనడంలో సందేహం లేదు.

అంతమాత్రాన మీరు కూడా ఆవేశానికి గురై డిప్రెషన్‌ భారిన పడటం మంచిది కాదు. మీ భర్త పురుషాధికార అహం ప్రదర్శిస్తూ విడాకులు ఇస్తాననడం సరికాదు. అయితే మీరు కూడా ఉద్యోగి కావడం వల్ల అంత అహంకారం ప్రదర్శించడం మంచిది కాదు. ఆడవారు మాత్రం అణగిమణిగి బ్రతకాలనుకోకండి. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. ఒకరు పొరపాటు చేస్తే మరొకరు వివేకంతో సరిదిద్దాలి. ఒకరికి కోపం వచ్చినపుడు మరొకరు సహనం వహించాలి. ఒకరి లోపాలను మరొకరు క్షమించాలి. ఒకరినొకరు ఆదరించి ఆక్కున చేర్చుకోవాలి, ప్రేమను పంచి వసం చేసుకోవాలి. దాంపత్య జీవితం కూడా ఒక కళాత్మక శాస్త్రమన్న విషయం గుర్తించండి.

నైనుణ్యాలు, మెళకువలు, వృత్తి, ఉద్యోగాలకే పరిమితమని భావించకండి. కుటుంబ సంబంధాలలోను నైపుణ్యాల పాత్ర బలీయమైనదని నమ్మండి. మీరు వెంట వెంటనే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. ఈ నేపధ్యంలో మీరే భర్తను కొంతవరకు నిరాకరించి ఉంటారు. సహజంగానే పిల్లలు పుట్టిన తరువాత ప్రతి తల్లికి పిల్లల ధ్యాసే ఎక్కువగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో లాగా తల్లి అయిన తరువాత భర్తకు దగ్గర కాలేకపోతుంటారు. ఇలాంటి దశలో పరిసరాల ప్రభావానికి గురై కొందరు భర్తలు పక్కదారి పట్టే అవకాశాలు ఉంటాయి.

మీ వారి సహ ఉద్యోగికి భర్త లేకపోవడం వల్ల కొత్త తోడుకోసం మీవారి పట్ల ఆకర్షితురాలై ఉండవచ్చు. లేదా మీ దగ్గర అసంతృప్తికి ఆ ఇద్దరు ఒకచోట దొరకని దాని కోసం వేరొకచోట వెదుక్కుంటున్నారని భావించాలి. కాబట్టి మీరు మీ భర్తతో ఘర్షణపడి మరింత దూరం కాకండి. మనసు విప్పి మాట్లాడి, హృదయాన్ని అర్పించి దగ్గర కావడానికి ప్రయత్నించండి. అందరికి చెప్పి, అల్లరి చేసి, అబాసుపాలు చేయడం మాని, ఆదరించేందుకు కృషి చేయండి. భర్త కోరుకున్న విధంగా వ్ఞంటూ ఆయన్ను ఆకట్టుకోండి. భర్తలోని బలహీనతలు ప్రతి భార్యకు తెలిసే ఉంటుంది. మీ బలాలతో అతని బలహీనతలపై విజయం సాధించండి. అంతేతప్ప విడాకులు ఊసెత్తకండి. అవసరమనుకుంటే ఇద్దరు కలిసి ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ తీసుకోండి. నిపుణులు మీలోని అపార్థాలు తొలగించి ప్రేమ సౌధాన్ని నిర్మిస్తారు.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌ రెడ్డి, సైకాలజిస్ట్‌