స్పందనకు ఇంకా సమయం ఉంది: కిరణ్‌కుమార్‌రెడ్డి

స్పందనకు ఇంకా సమయం ఉంది: కిరణ్‌కుమార్‌రెడ్డి
రాజమండ్రి: తన రాజకీయ భవిష్యత్‌ గురించి స్పందించేందుకు ఇంకా సమయం ఉందని ఎపి మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.సోమవారం ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడారు. వర్ష్షాభావ పరిస్థితుల కారణంగా రెండు రాష్ట్రాల్లో కరువు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. నీటికోసం న్యూఢిల్లీలో ఇద్దరు సిఎంలు పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని, ఎపిలో అమరావతి నిర్మాణంపై ప్రజలకు ప్రభుత్వం వివరించాలని అన్నారు.