స్థానిక సంస్థల్లో పేరుకే ప్రజాస్వామ్యం

muncipalities
muncipalities

ఇటీవలి కాలంలో గ్రామ పంచాయితీల నుండి నగర పాలక సంస్థల వరకు స్థానిక స్వపరిపాలన సంస్థల పనితీరును మధింపు చేసినట్లయితే ఎన్నికల
దగ్గర నుండి సమావేశాల వరకు ప్రజాస్వామ్య సంస్కృతి మేడిపండు చందమేనని చెప్పవచ్చు. స్థానికుల సమస్యలు స్థానికులకే ఎరుక అని నిర్ణయ
కార్యక్రమాల్లో,నిర్మాణ కార్యక్రమాల్లో స్థానికుల క్రియా శీలక భాగస్వామ్యం వల్లనే ప్రజాస్వామ్యం ప్రగతి పధంలో పయని స్తుందని రాజ్యాంగ నిర్మాతలు
ఆశించారు. దేశంలో పునాది స్థాయి లో గ్రామపంచాయితీలను ఏర్పాటుచేసి అవిస్వతంత్రంగా పనిచేయ డానికి అవసరమైన అధికారాలను అప్పగించాలని
రాజ్యాం గంలోని 40వ అధినియమం పేర్కొంది. దేశంలో మూడంచెల పంచాయితీ రాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి వాటికి ఆచరణపూర్వక అధికారాలు,
వనరులను అప్పగించాలని బల్వంతరాయ్‌ మోహతా కమిటీ 1956 లో సిఫారసు చేసింది. తదనుగుణంగా అమలులోకి తీసుకువచ్చిన ప్రథమ రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్‌ 14 మంది అఖిలపక్ష సభ్యులతో ఏర్పడిన అశోక్‌ మెహతా కమిటీ పంచాయితీ సమితులను ఏర్పాటు చేయాలని 1977లో సిఫారసు చేసింది.
పి.వి నరసింహారావ్ఞ ప్రధా నిగా ఉన్న కాలంలో 1993లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దేశంలో మూడంచెల పంచాయితీరాజ్‌ విధానం
ప్రవే శపెట్టారు. మొత్తం 29 అధికారాలను స్థానిక సంస్థలకు బదిలీ చేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించారు.
దేశంలోని చాలా రాష్ట్రాలు, అధికారాలను బదిలీ చేయగా, కర్ణా టక మరింత ముందడుగేసి ప్రత్యేక బడ్జెట్‌, స్వయంప్రతిపత్తి, జెడ్‌పి ఛైర్మెన్‌లకు మంత్రి
హోదా కల్పించింది. 73,74 సవరణ చట్టాల తర్వాత స్థానికస్వపరిపాలనలో ప్రజల భాగస్వామ్యం బాగా పెరిగింది. దేశంలో దాదాపు 30లక్షల మంది
స్థానిక ప్రజాప్రతినిధు లుగా ఎన్నికకాగా వీరిలో పది లక్షల మంది మహిళలు, ఐదు లక్షల మంది దళిత, ఆదివాసీలున్నారు.తెలంగాణాలో 1.04 లక్షల
మంది స్థానిక సంస్థలకెన్నియ్యారు. ఇటీవల 31 జిల్లాలు, 68 రెవెన్యూ డివిజన్లు 584 మండలాలుగా పునర్‌వ్యవస్థీకరించబడిన తర్వాత 22
జిల్లాపరిషత్‌లు 459 మండలపరిషత్‌లు, 8684 గ్రామపంచా యితీలు, ఆరుమునిసపల్‌ కార్పొరేషన్లు, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం,
నిజామాబాద్‌, వరంగల్‌, పెద్దపల్లి (రామగుండం), ఒక కంటోన్మెంటుబోర్డు, 42 పురపాలక సంస్థలు (స్పెషల్‌ గ్రేడ్‌-2, మొదటి శ్రేణివి-8,
రెండవ శ్రేణివి-15, మూడవ శ్రేణివి-17) 23 నగర పంచాయితీలు, మొత్తంగా 72 పట్టణ స్వపరిపాలన సంస్థలు పనిచేస్తున్నాయి స్థానిక సంస్థల
ఎన్నికల నిర్వహణ పూర్తిగా డబ్బు మయమైంది. వార్డ్‌ మెంబర్‌ నుండి కార్పొరేటర్‌ వరకు లక్షలు వెచ్చించి ప్రచారం బహుమతులివ్వడం,
డబ్బులివ్వడంద్వారా ఓటర్ల ను ఆకర్షిస్తున్నారు. కులం, మతం, ప్రాంతం కార్డు ఉపయోగిస్తు న్నారు. బలమైన ప్రత్యర్థులను హతమారుస్తున్నారు.
ఎన్నికయ్యాక ఖర్చంతా తిరిగి రాబట్టుకోవాలనే తపన తప్ప నిజ మైన సేవా దృక్పథం కనిపించడం లేదు. స్థానిక అధికారులతో కలిసి అవినీతికి
పాల్పడుతూ స్థానికులకే శఠగోపం పెడుతున్నారు. కమిషన్లు వచ్చే పనులు చేస్తూ నిజమైన ప్రజాఅవసరాలను గాలికొది లేస్తున్నారు. గ్రామపంచాయితీలు,
మండల పరిషత్‌ జిల్లాపరిషత్‌, పురపాలక, నగరపాలక సంస్థల సాధారణ సమావేశాలు పూర్తిగా అప్రజాస్వా మికంగా మారుతున్నాయి. చర్చలు,
సంప్రదింపులు లేకుం డానే పనుల ఎంపిక,నిధుల కేటాయింపు, ఖర్చు జరుగుతున్నాయి. చట్టసభలను అనుకరిస్తూ అరుపులు, పెడబొబ్బలతో ఏవో
ఒకటి రెండు సమస్యలను చర్చించి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నా రు. దీనివల్ల ప్రజల నిజ అవసరాలు ఎలాంటి చర్చలకు నోచుకోక మరుగున
పడుతున్నాయి.కొన్నిసార్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ‘కోరం లేదనే కారణం చూపుతూ వాయిదా వేస్తున్నారు.
స్థానిక సంస్థల పనితీరును మెరుగుపరిచి వీటిని మరింత ప్రజా స్వామ్యయుతంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వార్డు మెంబర్లు, సర్పంచ్‌లకు
ఇంటర్‌, డిగ్రీని అర్హతలుగా నిర్ణయించాలి. జనరల్‌ బాడీ సమావేశాలు వాయిదా పడకుండా ప్రతి సభ్యుడు విధిగా హాజరు కావాలనే నిబంధన తేవాలి.
అవినీతి నిర్మూలనకు పటిష్ట విధానాలు,పారదర్శక విధానాలు అమలుచేయాలి. రాజ్యాం గం నిర్దేశించిన మొత్తం అధికారాలను స్థానిక సంస్థలకు అప్పగించి
వాటికి వనరులను సమకూర్చాలి. ఎన్నికలు సకాలంలో జరపడం, సమాంతర వ్యవస్థలను తొలగించడం,కలెక్టర్లకు గల విశేషాధికారాల కు కత్తెరవేయడం,
రాజకీయాలు చొప్పించకుండా చేయడం ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రాట్లఅలక్ష్యం లేకుండా చూడటం, పూర్తిస్థాయి అటానమి సమకూర్చడం, వంటి
చర్యలను నిజమైన చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వాలు చేసినప్పుడు స్థానిక సంస్థలు విజయవంతం అవ్ఞతాయి. ఆన్‌లైన్‌ సేవలను పెంచడం, మొబైల్‌ ఆప్‌
ద్వారా ఎస్‌ ఎమ్‌ఎస్‌ అలర్ట్స్‌ ద్వారా పౌరులు తమ సమస్యలను (రోడ్లు, డ్రైనే జీ, త్రాగునీరు,కాలుష్యం అనుమతులు వగైరా)పంపుకునే సౌకర్యం
కల్పించాలి. ప్రతి గ్రామంలో రోడ్లు డ్రైనేజీని ప్రథమ ప్రాధాన్యతగా నూరుశాతం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. స్థానిక సంస్థలకు నిధులకేటాయింపును
పెంచడంపన్నుల వసూలుపరిధిని పెంచడం, దాతలు, కార్పొరేట్‌ సంస్థల లాభాల్లో వాటాలను గ్రామాలకు ఇవ్వ డం వంటి చర్యల ద్వారా స్థానిక
సౌభాగ్యానికి బాటలు వేయాలి. స్వరాజ్యం సురాజ్యమై వర్ధిల్లాలంటే ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు అనే అంకిత భావంతో పంచాయితీరాజ్‌
పాలన పారదర్శకంగా జవాబుదారీ తనంగా ఉండాలని మహాత్మాగాంధీ ఆశించారు. అదే ఆశయంతో పంచాయితీయే పార్లమెంటు, కార్యని ర్వాహక
వర్గంగా ప్రగతికి స్వయంగా బాటలు వేసుకొంటే ఈనాడు అన్నిటికీ కేంద్రరాష్ట్రాలపై ఆధారపడవలసిన ఆగత్యం ఉండేదికాదు. స్థానిక సంస్థలకు రాజ్యాంగం
నుంచే అధికారాలు సంక్రమించాలి తప్ప రాష్ట్ర శాసనసభల నుంచి కాదని మదులిమాయే, జస్టిస్‌ కృష్ణ య్యర్‌ వంటివారు సిఫార్సులు చేశారు.అయితే
ఆ సిఫార్సులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయేతప్ప ఆచరణకు నోచుకోలేదు. దీనిఫలితంగానే ఎక్కువ శాతం రాష్ట్రాల్లో పంచాయితీరాజ్‌ వ్యవస్థ
నిర్వీర్యమైపోయింది. అయితే యుపిఏ ప్రభుత్వహయాంలో పం చాయితీరాజ్‌ ప్రక్షాళనకు కొంత ప్రయత్నం జరిగింది. న్యాయ పంచాయితీ చట్టం,
ఇ-గవర్నెన్స్‌ వంటి సాంకేతిక పద్ధతి, వెను కబడిన ప్రాంతాల అభివృద్ధినిధి, రూరల్‌ బిజినెస్‌ హబ్స్‌ వంటి పథకాలు తెరమీదకు వచ్చాయి. ఇవన్నీ
ఆచరణలోకి వస్తే గ్రామీణ రాజ్యం ప్రగతి పథంలో నడవడానికి వీలయ్యేది. అయిదంచెల వ్యవస్థను మూడంచెల వ్యవస్థగా కుదించడానికి ప్రయత్నించినా
జరగలేదు. కానీ ఇంకా గ్రామాల్లో కనీస అవసరాలు, సౌకర్యాలకు అడ్రసు దొరకడం లేదు. ఇప్పటికీ గ్రామాల్లో నీటి సమస్య విల యతాండవం చేస్తోంది.
రక్షిత పథకాలు పేరుకే తప్ప ఎండమావ్ఞల వ్ఞతున్నాయి. తెల్లారిన దగ్గర నుంచి పొద్దుపోయేవరకు నీళ్ల వేట తప్పడం లేదు. కొన్ని మైళ్ల దూరం వెళ్లి
వాగుల వద్ద చెలమల్లో,అడుగంటిన దిగుడుబావ్ఞల్లోనీటిని తోడుకుని కడవలతో ఇంటికి మోసుకొస్తున్నారు.
అలానే మురికినీటి పారుదల వ్యవస్థ పక్కాగా ఏర్పడం లేదు. చిన్న సెలయేళ్లలా వీధుల్లో మురుగునీరు ప్రవహిస్తోంది. రోడ్ల సంగతి చెప్పక్కర లేదు.
అసలు రోడ్లు నిర్మిస్తున్నారో లేదో తెలియడం లేదు. చెత్తను సేకరించే అలవాటు ఎవరికీ ఉండడం లేదు. చెత్త కుప్పలు అడుగడుగునా దర్శనమిస్తుంటాయి.
వీటిలో ఘన, ద్రవ్యపదార్థాలను వేరు చేసే ప్రక్రియ ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి సమస్యలు సుదీర్ఘకాలంగా వెంటాడుతున్నాయంటే పంచాయితీ
రాజ్‌ వ్యవస్థ ఏ విధంగా తయారైందో స్పష్టమవ్ఞ తోంది. పంచాయితీ అభివృద్ధిని కోరుతూ పదమూడో ఆర్థిక సంఘం కేటాయించిందే రూ. 30వేల కోట్లని
ఇదెందుకూ సరిపో దని వేదనపడుతుంటే ఆ కేటాయింపులోనూ స్వాహారాయుళ్లు అందినకాడికి అందుకుని భోంచేశారన్న ఆరోపణలున్నాయి. ఇటువంటి
పంచాయితీలకు జీవం పోయాలన్న లక్ష్యంతో 14వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు ప్రాధాన్యం కల్పించి రెండు లక్షల 87వేల కోట్ల రూపాయలు
కేటాయించింది. అయిదేళ్ల వ్యవధిలో ఈ నిదులు నేరుగా గ్రామపంచాయితీలకే అందుతాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ నిధులను పకడ్బందీగా
ఏ విధంగా ఖర్చు చేయగలుగుతారన్నది ప్రశ్న.

తండ ప్రభాకర్‌ గౌడ్‌