స్థానిక యువతకు ఉపాధి దొరికేనా?

ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాలో బహుళ ఉత్పత్తుల పరిశ్రమలను సోంపేట సాగరతీరం వద్ద నాగార్జున నిర్మాణ సంస్థ నిర్మించడానికి ముందుకు రావడంతో స్థానిక నిరుద్యోగుల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌గానీ, ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో గానీ, ఒడిశా పాలకుల చేతిలో గండొంజిల్లాగా భాసిల్లిన సోంపేటతోపాటు ఇంకా అనేక మత్స్యకార ఆదివాసీ ప్రాంతాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడంతోపాటు వలసల అడ్డాగా ముద్రపడ్డాయి.
రాష్ట్ర విభజనకు ముందే జస్టిస్‌ శ్రీకృష్ణకమిషన్‌ పేర్కొన్న నివేదికలో వెనుకబడిన ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలను పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా పారిశ్రామికంగా నవ్యాంధ్ర తిరోగమన దిశగా కనిపిస్తుండగా గతంలో అధికార కేంద్రీకరణ వల్ల హైదరాబాద్‌ అభివృద్ధి చెంది మిగతా ప్రాంతాల్లో ఆర్థిక పారిశ్రామిక విద్య, వైద్య సామాజిక రంగాల్లో అసమానతలు చెలరేగాయి. అటు వంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండటానికి మేధావులు సూచించిన విధంగా చంద్రబాబు సర్కార్‌ అధికార వికేంద్రీకరణ చేపడతామని ప్రకటించింది. అందులో భాగంగా 13 జిల్లాల్లో సమగ్రాభి వృద్ధికి ఒక పారిశ్రామిక విజన్‌ ప్రకటించడం జరిగింది. ప్రధానంగా వలసల అడ్డాగా ముద్రపడ్డ ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాలో వలసలు నిరోధించిఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే విధంగా తొలుత ఉద్దాన ప్రాంతమైన సోంపేట సాగరతీరం వద్ద ఒక పారిశ్రామిక మండలి ఏర్పాటుకు సర్కార్‌పచ్చజెండా ఊపింది.గతంలో ఈ బీడుభూము ల్లో ధర్మల్‌పవర్‌ ప్లాంట్‌ నిర్మానానికి ఒక కంపెనీ ముందుకు వస్తే పర్యావరణ పరిరక్షణ సంఘాలు కొనసాగించిన దుష్పచారం వల్ల రాజ్యహింసలో అమాయకులు ముగ్గురు బలికాబడ్డారు. ఇదే పరిస్థితి సగం నిర్మాణం పనులు పూర్తి చేసుకున్న ఈస్ట్‌కోస్ట్‌ ఎనర్జీ ధర్మల్‌ ప్లాంట్‌ వద్ద కూడా పర్యావరణ తీవ్రవాదులు కొనసాగించిన ఆందో ళన వల్ల కాకరపల్లి వద్ద ఇద్దరు రాజ్యహింసకు బలికాబడ్డారు. ఈ రెండు ఘటనలతో ఉత్తరాంధ్రలో పరిశ్రమలు స్థాపనకు పెట్టుబడి దారులు ముందుకు రాకుండా ఇతర ప్రాంతాలకు తరలిపోయి అక్కడ పరిశ్రమలు నెలకొల్పారు.
వాస్తవానికి సోంపేట బీడుభూములు చాలా కాలం నుంచి అధిక వ్యవసాయ దిగుబడులు రాక ఒక్క పంట మాత్రమే దిగుబడి కావడం వల్ల అనేక మంది రైతులు రొయ్యల సాగు చేసే వ్యక్తులకు ఈ భూములు అమ్మేవేసిన పరిస్థితులున్నాయి. సోంపేట మండల కేంద్ర మైన పుటాకీ కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో బారువా సాగర తీరం ఉంది. ఒకప్పుడు ఓడరేవు కేంద్రంగా బారువా భాసిల్లింది. కీర్తిశేషులు గౌతులచ్చన్న స్వగ్రామంలో నేడు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలతోపాటు ప్రభుత్వ ఆస్పత్రి, పోలీస్‌ స్టేషన్‌, బాలుర సంక్షేమశాఖ గ్రాంథాలయం, పోస్టాఫీస్‌ తదితర కార్యాలయాలు ఉ న్నాయి. ఒక విధంగా బారువా మత్స్యకారుల కూడలి కాబడినప్ప టికీ స్థానికంగా వంతెన లేకపోవడం వల్ల అనేక మంది మత్స్యకార గ్రామాలు సోంపేటపై ఆధారపడాల్సి వచ్చింది. కూడలిలో వంతెన నిర్మిస్తే సోంపేటకు రాకపోకలు తగ్గిపోతాయి.బారువా మరింత అభి వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సకాలంలో సోంపేట మండలం బారువా వద్ద పారిశ్రామిక మండలి నెలకొల్పితే ఆహార వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఫార్మా కర్మాగారాలు, ఇంజినీరింగ్‌ క్లస్టర్‌, విద్యత్‌, విద్యుదీకరణ పరికరాల తయారీ, వస్త్ర పరిశ్రమ సౌరవిద్యుత్‌ ఉత్పత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ వేర్‌హౌసింగ్‌, కోల్డ్‌స్టోరేజి, ప్యాకింగ్‌ తయారీ కేంద్రాలు, వస్తే ఉద్దానం రూపు రేఖలు మారడం ఖాయంగా నిరుద్యోగ యువత ఆశతో ఎదురుచూ స్తున్న పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో బారువా ధర్మల్‌పవర్‌ ప్లాంట్‌ను వ్యతిరేకించిన పర్యావరణ పరిరక్షణ సంఘాలు ఏకోఫ్రెండ్లీ కలిగిన పరిశ్రమలకు నెలకొల్పితే పర్యావరణాన్ని పరిరక్షించబడడమే గాక స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొద్దోగొప్పొ లభిస్తా యన్న ఆలోచనతో అభ్యంతరం చెప్పరని బారువా యువత కోరుకోంటుంది.

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పారిశ్రామిమీకరణను వ్యతిరేకిస్తే స్థానిక యువత ఎంతో నష్టపోవడమేకాక ఉద్దాన ప్రాంత కూడలిగా భాసిల్లుతున్న బారువా ప్రాంతం మరింత తిరోగమించే ప్రమాదం లేకపోలేదన్న భావన కన్పిస్తుంది. ఏదిఏమైనా వెనుక బాటుతనంతోపాటు వలసల అడ్డాగా ముద్రపడ్డ ఉత్తరాంధ్ర జిల్లాలో రాష్ట్ర సర్కార్‌ ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం కార్య రూపందాల్చితే ఉద్దానప్రాంత ప్రజానీకం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. కేవలం పారిశ్రామిక మండలికే పరిమితం కాకుండా భువనపాడు, కళింగపట్నంతోపాటు బారువాలో కూడా ఓడరేవు నిర్మానానికి తగ్గపరిశలన జరపడానికి సర్కార్‌ ప్రయత్నం చేయాలి.