స్థానిక పొత్తులపై కొలిక్కిరాని ‘సంకీర్ణం’

KUMARA SWAMI, SIDDHA RAMAIAH
KUMARA SWAMI, SIDDHA RAMAIAH

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో జనతాదళ్‌ సెక్యూలర్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుకు కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత ఇపుడు తాజాగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులకు మరోసారి చర్చలకు తావిస్తోంది. ఈఏడాది మేనెలలో ఎన్నికల అనంతరం పొత్తులతో సంకీర్ణప్రభుత్వం ఏర్పాటుచేసి జెడిఎస్‌కు చెందిన కుమారస్వామినిముఖ్యమంత్రిగా నియమించిన తర్వాత తాజాగా 100కుపైగా నగర,పట్టణమున్సిపాలిటీలు,నగర పంచాయితీలకు ఈనెల 29వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. సెప్టెంబరు ఒకటవ తేదీ వీటి ఓట్లను లెక్కిస్తారు. ఇకమైసూరు, శివమొగ్గ,తుమకూరు జిల్లాలకు ఎన్నికలు జరిపే వీలులేదు. వార్డుల రిజర్వేషన్‌కు సంబంధించిన కేసు కర్ణాటక హైకోర్టు విచారణలో ఉంది. 29 మున్సిపల్‌కార్పొరేషన్లు, 53 మున్సిపాలిటీలు, 23 నగర పంచాయితీలకు ఎన్నికలు జరుగతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పిఎన్‌ శ్రీణివాసాచారి వెల్లడించారు. రాష్ట్రమంత్రి కృష్ణబైరెగౌడ మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ సంస్థల ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించినందున సంకీర్ణప్రభుత్వం నడుస్తున్న తరుణంలోమరోసారి భాగస్వామ్యపార్టీలుచర్చించుకోవాల్సి అవసరం ఏర్పడిందని అన్నారు. ఎన్నికల తర్వాత పొత్తులా లేక ఎన్నికలకుముందు పొత్తులు కుదుర్చుకోవాలా అన్న అంశంపై ఇప్పటికీ నిర్ణయానికి రాలేదని, అయితే చర్చలు జరుగుతాయని అన్నారు. పొత్తులపైసాధ్యాసాధ్యాలపట్ల చర్చిస్తున్నామని, ఎన్నికలకు ముందు అవగాహనకు రావాలన్నదే తమ అభిమతమన్నారు. కేబినెట్‌ మంత్రిపదవుల పరంగా సంకీర్ణ భాగస్వామ్యపార్టీల్లోని నేతలపై ఇప్పటికే సమస్యలు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ కేడర్‌కు స్పష్టమైన సంకేతాలిస్తూ జెడిఎస్‌ నాయకత్వానికి ఆర్ధికశాఖనే కొనసాగించాలనిసూచించారు. ముందస్తు కూటమి నిర్ణయానికి వస్తే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలన్నది నిర్ణయించడం సవాళ్లతోకూడుకున్నదేనని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నదృష్ట్యా ఈ పొత్తుల కలయిక ఎంతమేర విజయవంతం అవుతుందన్నది పార్టీలమధ్య అంతుబట్టకుండా ఉంది. ఈనెల 17వ తేదీకల్లా అభ్యర్ధులునామినేషన్లు దాఖలుచేయాలి. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 20వ తేదీ తుదిగడువు. మొత్తం 40వేల మంది సెక్యూరిటీ సిబ్బంది హాజరవుతుండగా ఎన్నికల్లో ఇవిఎంలనే వినియోగించాలనినిర్ణయించారు.