స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా!

kanagaraj
kanagaraj

అమరావతి: ఏపిలో స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. గతంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అప్పటి ఎన్నికల కమీషనర్‌ రమేష్‌ కుమార్‌ స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఆ గడువు ఏప్రిల్‌ 31తో ముగిసిపోయింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మరోసారి నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ కనగరాజ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ పై కోర్టులో కేసు ఉన్నందున ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుండే తిరిగి ప్రారంభమవుతుందని కనగరాజ్‌ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/