స్టైలిష్‌ లుక్‌లోకి..

PRABHAS1
PRABHAS

స్టైలిష్‌ లుక్‌లోకి..

ప్రభాస్‌ ఇపుడు జాతీయస్థాయిలో పాపులారిటీ ఉన్న పెద్దస్టార్‌.. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న కొత్త చిత్రం సాహో.. షషూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది.. ఈచిత్రంలో ప్రభాస్‌ సరికొత్త లుక్‌ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. దానికి సంబంధించి ఫొటో షూట్లు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి.. సాహో చిత్రాన్ని భారీస్థాయిలో రూపొందించేందుకు నిర్మాతలు చిన్న అవకాశాల్ని కూడ వదిలి పెట్టటం లేదు.. తెలుగుతోపాటు హిందీలోకూడ విడుదల కానున్న ఈచిత్రంలో సరికొత్త లుక్‌లో కన్పిస్తారట.. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.