స్టేడియంలో చిరు జ‌ల్లులు

green field stadium
green field stadium

త్రివేండ్రంః భారత్‌-న్యూజిలాండ్‌ మూడో టీ20కి వర్షం ముప్పు పొంచివుంది. రాత్రి 6:30 గంటలకు టాస్‌ వేయాలి. 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాలి. ఐతే ఉదయం నుంచి గ్రీన్‌ఫీల్డ్స్‌ అంతర్జాతీయ మైదానంలో తేలికపాటి చిరుజల్లులు పడుతున్నాయి. సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పిఉంచారు. వర్షం ఆగిపోతే 15-20 నిమిషాల్లో మైదానం సిద్ధం చేయగలమని కేరళ క్రికెట్‌ సంఘం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి మ్యాచ్‌ ప్రారంభం అవుతుందా లేదా తెలియని పరిస్థితి నెలకొంది. రెండు జట్లు 1-1తో సమంగా నిలవడంతో ఈ టీ20 నిర్ణయాత్మకంగా మారింది.