స్టెరిలైట్‌ ఆందోళనలపై సిబిఐ మరో కేసు నమోదు

sterilite
sterilite

తమిళనాడు పోలీస్‌,రెవెన్యూ సిబ్బందిపై కూడా కేసు
చెన్నై: వేదాంత అనుబంధంగా ఉన్న స్టెరిలైట్‌ కర్మాగారం తమకు వద్దని చేపట్టిన ఆందోళనలపై దర్యాప్తుచేపట్టిన సిబిఐ తాజాగా నేరపూరిత కుట్ర, దొంగతనం, దోపిడీ, చట్టాన్ని ధిక్కరించడం, పోలీసులను, రెవెన్యూఅధికారుల్లో ని సిబ్బంది తమను గాయపరచడం వంటి అభియోగాలతో కొత్తకేసులు నమోదుచేసింది. గతమేనెల 22వ తేదీ తూత్తుకుడిలో జరిగిన ఈ ఆందోళనల్లో 13 మంది ఆందోళన కారులు చనిపోయారని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిసిబిఐ వరుసగా రెండోకేసు నమోదుచేసింది. గుర్తుతెలీని వ్యక్తులపై ఈ అభియోగాలతోకేసు నమోదుచేసారు. సిపిఐఎం జిల్లా కార్యదర్శి కె.అర్జునన్‌ ఇచ్చిన పిర్యాదుమేరకు ఈకేసులు నమోదయ్యాయి. సిపిఎం కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదులో అన్ని అంశాలను సిబిఐ కవర్‌చేసింది. గడచిన మేనెల 29వ తేదీ ఇచ్చిన ఫిర్యాదుల్లో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని, నేరం జరిగిందనడానికి ఆధారాలున్నాయని గుర్తుతెలీని వ్యక్తులు, ప్రభుత్వ సిబ్బంది, పోలీస్‌, రెవెన్యూ శాఖలనుంచి వచ్చినవారే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో నమోదుచేసారు. నేరపూరితకుట్రకు సంబంధించిన సెక్షన్లతో ఐపిసి కింద నమోదయ్యాయి. పోలీస్‌ కాల్పులకు సంబంధించిన సంఘటనలపై దాఖలైన పిటిషన్లను విచారించినమద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌ ఆగస్టు 14వ తేదీ సిబిఐని దర్యాప్తుచేసి నివేదిక అందించాలని వెల్లడించింది. తమిళనాడు పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారని, తూత్తుకుడి వద్దని చేపట్టిన వందవరోజు ఆందోలనలపరంగా స్థానికులు ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని, స్టెరిలైట్‌ కాపర్‌ప్లాంట్‌ను మూసివేయాలని డిమాండ్‌చేసారని వెల్లడించారు. ఆనాటి ఆందోళనల్లో 13 మంది చనిపోయారని, డిఎంకె సైతం ఈ కాల్పులను తీవ్రంగా వ్యతిరేకించిందని అన్నారు. పోలీసు జాగిలాలనుప్రవేశపెట్టడం, అక్రమమని, కాల్పులు ప్రారంభించడం అనైతికమని సిపిఎం కార్యదర్శి ఆరోపించారు. అందువల్లనే జస్టిసెస్‌ సిటి సెల్వమ్‌, బషీర్‌ అహ్మద్‌లతో కూడిన బెంచ్‌ సిబిఐ దర్యాప్తుచేసి నివేదిక ందించాలని అన్నారు. అంతేకాకుండా వందవరోజు నిరసన ప్రదర్శనలపై సిఆర్‌పిసి సెక్షన్‌ 144 ప్రకారం నిషేధపుటుత్తర్వులు జారీచేసినట్లు ప్రభుత్వం, పోలీస్‌ అధికారులు చెపుతున్నారు. ఎగ్జిక్యూటివ్‌మేజిస్ట్రేట్‌ అధికారాలు లేని అధికారి ఈ ఉత్తర్వులు జారీచేసారన్న అభయోగాలను సైతం సిబిఐ నమోదుచేసింది.