స్టీల్ ప్లాంట్ విష‌యం విభ‌జ‌న చ‌ట్టంలో ఉంది

adinarayana reddy
adinarayana reddy

క‌డ‌పః కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలనే అంశం విభజన చట్టంలో ఉందని మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. అయితే, బీజేపీ, వైఎస్ఆర్‌స‌పిలు ఈ విషయంలో డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. కడప జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
మరో మంత్రి అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేపట్టినప్పటికీ… కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని మండిడ్డారు. గాలి జనార్దన్ రెడ్డి కోసమే స్టీల్ ప్లాంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. మరోవైపు, సీఎం రమేష్ దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. దీంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.