స్టీఫెన్ హాకింగ్‌కు నివాళుల‌ర్పించిన ర‌ష్యా వ్యోమ‌గాములు

Stephen Hawking
Stephen Hawking

మాస్కో: ఇటీవల కన్నుమూసిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌కు రష్యా అంతర్జాతీయ రోదసీ కేంద్రంలోని వ్యోమగాములు ఘనంగా నివాళులర్పించారు. భూమిని సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ చుట్టి వస్తున్న రోదసీ కేంద్రాన్ని చూపుతున్న వీడియోను రష్యా టుడే ఛానల్‌ ప్రసారం చేసింది. ఇందులో పాల్గొన్న‌ ఒక వ్యోమగామి మాట్లాడుతూ తాము ప్రకృతిని అన్వేషిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్న సమయంలో మానవత్వానికి సంబంధించిన హాకింగ్‌ సందేశాన్ని విన్నామని ఆయన చెప్పారు. ఇంతలోనే హాకింగ్‌ దూరమయ్యారన్న వార్త తమకు తెలిసి ఖిన్నులమయ్యామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వారు హాకింగ్‌ ప్రవచనాలను ఉటంకించారు.