స్టార్క్ అవుట్

బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తుండడంతో భారత్ విజయానికి చేరువవుతోంది. ఎనిమిదో వికెట్‌కు 39 పరుగులు జోడించిన కమ్మిన్స్, స్టార్క్ జోడీని షమీ విడదీశాడు. మిచెల్ స్టార్క్ (18)ను బౌల్డ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 72 ఓవర్లలో ఎనిమిది వికెట్లో కోల్పోయి 218 పరుగులు చేసింది. కమ్మిన్స్ (31 నాటౌట్), లియాన్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. విజయానికి మరో 82 పరుగుల దూరంలో ఉంది. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీశాడు. బుమ్రా, షమీ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇషాంత్ ఓ వికెట్ పడగొట్టాడు.