స్టాక్‌ మార్కెట్లలో రికవరీ

SENSEX
ఐటి, ఆయిల్‌గ్యాస్‌, హెల్త్‌కేర్‌ మద్దతు
డాలర్‌ వర్సెస్‌ రూపాయి 68.67
ముంబై : బెంచ్‌మార్క్‌ స్టాక్‌ సూచీలన్నీ ఇంట్రాడే నష్టాలను తగ్గించుకుని లాభాల్లో పుంజుకున్నాయి. యూరోపి యన్‌ మార్కెట్లధోరణులు, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ఇండస్ట్రీస్‌ వంటి వాటి ఫలితాలు మరి కొంత లాభాలను పెంచాయి. బిఎస్‌ఇ సెన్సె క్స్‌ 190 పాయింట్లు పెరిగి 23,382 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50 సూచీ 60 పాయింట్లు పెరిగి 7108 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇకమిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.1 శాతం చొప్పున దిగజా రాయి. మార్కెట్‌పరంగా సెన్సెక్స్‌లో 1587 కంపెనీలు క్షీణిస్తే 862 కంపెనీలు స్వల్పలాభాలు సాధించాయి. భారతీయ రూపాయి మారకం విలువలు రికార్డు కనిష్టస్థాయిలో ఉన్నాయి. 68.67 రూపాయలవద్ద ఇంట్రాడేలో చెలామణీ అయింది. 2013 ఆగస్టునెలలో 68.85 రూపాయలవద్ద ట్రేడింగ్‌ జరిగిన సంగ తి తెలిసిందే. మార్కెట్ల ర్యాలీకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా వంటివి గరిష్టంగా ట్రేడింగ్‌ నిర్వహించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు అనిశ్చితంగా ట్రేడింగ్‌ జరిగింది సౌదీ అరేబియాతో ఇరాన్‌ ఎటువంటి ఒప్పందానికి రాదని, రష్యాతో కూడా అదే తీరుతో ఉందన్న ప్రచారంతో ధరల్లో విపరీత మార్పులు చోటుచేసుకున్నాయి. బ్రెంట్‌ ముడిచమురు 31 సెంట్లు క్షీణించి 31.87 పాయింట్లవద్ద స్థిరపడితే తదనంతరం బ్యారెల్‌కు 32.83 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక వివిధ సూచీలు, సెక్టార్ల పరంగాచూస్తే బిఎస్‌ఇలో హెల్త్‌కేర్‌ సూచి 2శాతం పెరిగింది. ఆయిల్‌ గ్యాస్‌ సూచి 1.4శాతం పెరిగితే వినియోగరంగ వస్తు ఉత్పత్తుల సూచి 2.3శాతం దిగజారింది. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షి యల్‌ ప్యాక్‌ పరంగాచూస్తే మిశ్రమంగా ఉంది. ప్రైవేటురంగ బ్యాంకు ల్లో ఐసిఐసిఐబ్యాంకు, యెస్‌బ్యాంకు, యాక్సిస్‌బ్యాంకులు 0.4 నుంచి 3శాతం చొప్పున దిగజారాయి. హెచ్‌డిఎఫ్‌సి జంట సంస్థలు 0.5శాతం చొప్పున లాభపడ్డాయి. భారతీయ స్టేట్‌బ్యాంకు రెండు శాతం పెరిగింది. కంపెనీ స్టాక్‌ అంతకుముందురోజు ట్రేడింగ్‌ నుంచి కొంత సవరణలు చోటుచేసుకున్నాయి బ్యాంకు యాజమాన్యం వచ్చే త్రైమాసికంలో కూడా లాభాలు తగ్గే అవకాశం ఉందని, నిరర్ధక ఆస్తు లు పెరుగుతాయని దీనివల్ల బ్యాంకు లాభదాయకత పెరిగిందన్నారు. టాటామోటార్స్‌ మూడుశాతం క్షీణించింది. భారత్‌ఫోర్జ్‌ జనరల్‌ డైన మిక్స్‌ కూటమిలో 11 బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టును చేపట్టింది. భారతీయ సైన్యం కోసం ఇన్‌ఫ్యాంట్రీ వాహనాలను ఉత్పత్తిచేస్తుం ది. భవిష్యత్తు సైనిక అవసరాలకు వీటిని తయారుచేస్తున్నది. డా.రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ 1.5శాతం లాభపడింది. అమెరికా అను బంధ సంస్థ అమెరికా ఎఫ్‌డిఎ నుంచి సెరినివో స్ప్రే ఉత్పత్తి మార్కె టింగ్‌కు ఆమోదం పొందింది. సిప్లా సంస్థ ఒకటిశాతం పెరిగింది. మారిషస్‌ ఆధారిత ఫిల్‌ కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సిప్లా హెల్త్‌లో పెట్టు బడులు పెడుతోంది. సన్‌ఫార్మా 2.3శాతం పెరిగింది. లూపిన్‌ 2 శాతం క్షీణించింది. ఇన్ఫోసిస్‌ 1.1శాతం లాభపడింది. ఐటి మేజర్‌ 20 బిలియన్‌ డాలర్ల విక్రయాలను ఛేదించాలని 2020 నాటికి లక్ష్యం విధించింది. హెచ్‌సిఎల్‌ టెక్‌ స్వల్పంగా క్షీణించింది. ఇక బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 3శాతం దిగజారింది. ఎస్‌అండ్‌పి రేటింగ్స్‌ సర్వీసెస్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రతికూల రేటింగ్‌ ఇవ్వడమే కారణం. బిపిసిఎల్‌ 3.3శాతం పెరిగింది. కేరళలోని కోచి రిఫైనరీకి పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు లభించడమే కీలకం. ఇక గ్లెన్‌మార్క్‌ ఫార్మా అమెరికా ఎఫ్‌డిఎనుంచి ఔషధాలకు అనుమతి సాధించింది. షేర్లు 2.4శాతం పెరిగాయి జస్ట్‌డయల్‌ 15శాతం పెరిగింది. 509 రూపాయలు చొప్పున ట్రేడింగ్‌ జరిగింది. ఎన్‌ఎస్‌ఇలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. యుబిహోల్డింగ్స్‌ షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు కంపెనీని బకాయిదారుగా ప్రకటించడమే ఇందుకుకీలకం. ఆరుశాతం క్షీణించాయి. క్రిసిల్‌ అలహాబాద్‌ బ్యాంకు స్థిరాస్తి మ్రాణాలు మరింత క్షీణించే అవకాశం ఉన్నందున టైర్‌ బాండ్ల రేటింగ్స్‌ తగ్గించినా బ్యాంకు షేర్లు మాత్రం 0.5శాతం పెరిగాయి.