స్టాక్‌ మార్కెట్లలో బుల్‌రన్‌

Stock Market
Stock Market

ముంబాయి: స్టాక్‌మార్కెట్లు మరోసారి రికార్డులు అధిగమించాయి. భారతీయ స్టేట్‌బ్యాంకు
డిపాజిట్‌ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడం కొంత మేలు చేసింది. అలాగే ఇన్వెస్టర్లు రిజర్వుబ్యాంకు
వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో కొనుగోళ్లు పెంచారు. ఎన్‌ఎస్‌ఇ సూచీ 62.6 పాయిట్లుపెరిగి
10,077.10 పాయింట్లవద్ద స్థిరపడితే బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 205.06 పాయింట్లు పెరిగి
32,514.94 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బిఎస్‌ఇ విభా గసూచీల్లో వినియోగ రంగ ఉత్పత్తులసూచీ
ఎక్కువ పెరిగి 1.86శాతం వృద్ధి నమోదు చేసింది. మెటల్‌ 1.60శాతం,పిఎస్‌యు 1.66శాతం, కేపిటల్‌గూడ్స్‌
1.4శాతంపెరిగాయి. ఇతరత్రా హెల్త్‌కేర్‌ సూచీ 1.52శాతం, ఎఫ్‌ఎంసిజి 0.99శాతంగా దిగజారాయి. సెన్సెక్స్‌లో టాప్‌
ఐదు సంస్తల్లోభారతీయ స్టేట్‌బ్యాంకు 4.46శాతం, పవర్‌గ్రిడ్‌ 4.23శాతం, టాటాస్టీల్‌ 2.89శాతం, ఎల్‌అండ్‌టి 2.85శాతం,
ఒఎన్‌జిసి 2.82శాతంపెరిగాయి. ఇతరత్రా సన్‌ఫార్మా 3.47శాతం, డా.రెడ్డిస్‌ 3.11వాతం, లూపిన్‌ 2.9శాతం, ఐటిసి 2.09శాతం,
సిప్లా 1.18శాతం దిగజారాయి. భారతీయ స్టేట్‌బ్యాంకుషేర్లు కనీసం ఐదుశాతంపెరిగాయి. వడ్డీరేట్లను 50బేసిస్‌ పాయింట్లు తగ్గించి
3.5శాతానికి కుదించడమే ఇందుకుకీలకం. నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్‌సూచీ ఎస్‌బిఐ ప్రకటన తర్వాత నాలుగుశాతం పెరిగింది.
ఎల్‌అండ్‌టి షేర్లు నాలుగుశాతంపెరిగాయి. త్రైమాసికఫలితాల్లో 46శాతం నికరలాభాలు పెరగడమే ఇందుకుకీలకం.
నిఫ్టీ ఫార్మాసూచీ 1.8శాతం దిగజారింది. ఫార్మారంగ స్టాక్స్‌ క్రమేపీ కోలుకున్నాయి. అమెరికాఎఫ్‌డిఎ కొన్ని ఉత్పత్తులపై ఆంక్షలు
ఎత్తివేస్తుందన్న ప్రచారమే ఇందుకుకీలకం. ఔాక్టర్‌ రెడ్డిస్‌ ల్యాబ్స్‌, సన్‌ఫార్మా వంటివి 3శాతం దిగజారాయి. భారతీయ రిజర్వుబ్యాంకు తన వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. రాయిటర్స్‌ వార్తాసంస్థ అంచనాలను చూస్తే ఖచ్చితంగా 25బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తుందని అంచనా. డిబిఎస్‌గ్రూప్‌ రీసెర్చి విభాగం 25బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తుందని వెల్లడించింది. ఇన్వెస్టరు కూడా ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గిపుపైనే ఎక్కువ ఆసక్తితో ఉన్నారు. ఆసియా మార్కెట్లపరంగాచూస్తే చైనా గణాంకాలు పటిష్టంకావడంతో కొంత సానుకూలంగా నడిచాయి. డాలర్‌ కొంతమేర పెరిగింది. అమెరికా రాజకీయ అనిశ్చితికారణంగా ఎగువ ప్రాంతంలో కొంత కట్టడిజరిగింది. ఆసియా పసిఫిక్‌షేర్లు జపాన్‌ బైట ప్రాంతంలో 0.1శాతంపెరిగాయి. అమెరికా డౌజోన్స్‌ పారిశ్రామిక సగటు 0.15శాతం పెరిగింది.