స్టాక్‌ మార్కెట్లపై ఫార్మారంగ ఒత్తిడి

SENSEX-DOWN
ప్రభుత్వ నిషేధమే కీలకం
ఆసియా, యూరోప్‌, ఫెడ్‌రిజర్వులపై ఆసక్తి
నష్టాల్లో ముగిసిన ఈక్విటీ మార్కెట్లు
ముంబై : కేంద్ర ప్రభుత్వం 300కుపైగా స్థిరమైన మోతాదు మిళితమైన మందులు (ఎఫ్‌డిసి)ను నిషేధించినట్లు ప్రకటించడంతో ఫార్మారంగ షేర్లు మంగళవారం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఇన్వెస్టర్లు రెండురోజుల ఫెడ్‌ పాలకవర్గ సమావేశం వివరా లపై ఎక్కువ ఆసక్తి చూపించారు. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 253 పాయింట్లు దిగువన 24,551 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50 సూచి 78 పాయింట్ల దిగువన 7461 పాయింట్లవద్ద స్థిరపడింది. ఇక బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌కాప్‌ సూచీలు 0.6 నుంచి 0.8శాతం మధ్యలో ముగిసాయి. మార్కెట్లపరంగాచూస్తే బిఎస్‌ఇలో 1630 కంపెనీలు నష్టాల్లోముగిస్తే 1011 కంపెనీలు స్వల్పలాభాలు చవిచూశాయి. ఇటీవలే నిఫ్టీ పదిశాతంమేర కనిష్టస్థాయి 6825నుంచి పెరిగింది. ఇదే తీరు కొనసాగుతూ నిఫ్టీ 7800 నుంచి 7900 మధ్యలో కొనసాగు తుందని అంచనా వేస్తున్నారు. నిప్టీ లక్ష్యం 6600 నుంచి 6300 వరకూ వచ్చే నాలుగు నుంచి ఆరునెలలవరకూ ఉంటుందని ఐడిబిఐ కేపిటల్‌రీసెర్చి హెడ్‌ ఎకెప్రభాకర్‌ వ్యాఖ్యానిం చాయి. ఇక కరెన్సీ పరంగాచూస్తే రూపాయి మారకం విలువలు 11పైసలు పెరిగి 67.32 వద్ద కొనసాగాయి. అమెరికా కరెన్సీ డాలర్‌ విక్రయాలు ఎక్కువ డిమాండ్‌ రావడంతో స్వల్పంగా పటిష్టం అయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా 1037 కోట్ల రూపాయలు ముందురోజు కొనుగోళ్లు జరిపినట్లు ఎక్ఛేంజి గణాంకాలు చెపుతున్నాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగునెలల కనిష్టస్థాయి అంటే 5.18శాతానికి చేరింది. ఇక విదేశీ మార్కెట్ల పరంగాచూస్తే అన్ని షేర్లు దిగజారాయి. ఆసియా మార్కెట్లపరంగా చూస్తే బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ ఆర్ధిక వ్యవస్థసంక్లిష్టపరిస్థితిని వివరించింది. ముడిచమురు ధరలు మరోసారి దిగజారాయి. బ్యాంక్‌ఆఫ్‌ జపాన్‌ విధివిధానాలను స్థిరంగా కొనసాగించడంది. అమె రికా ఫెడ్‌ రిజర్వు సమీక్ష కారణంగా కొంత అప్రమ త్తం అయింది. ఇకయూరోప్‌ మార్కెట్లపరంగా ఫ్రాన్స్‌ సిఎసి, జర్మనీ డాక్స్‌, లండన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ వంటివి 0.2 నుంచి ఒకటిశాతం క్షీణించాయి. ఇక దేశీయ మార్కెట్లపరంగా పార్మాకంపెనీల షేర్లు ఎక్కువ ఒత్తిడికి లోనయ్యాయి. ఏడు శాతం క్షీణించాయి. ప్రభుత్వం 300వరకూ ఫిక్సెడ్‌డోస్‌ కాంబినేషన్‌ మందులను నిషేధిం చడమే ఇందుకు కీలకం. లూపిన్‌, దివిస్‌ లాబ్స్‌, అరబిందో ఫార్మా, అనుహ్‌ ఫార్మా, జుబిలి యంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, డిష్‌మ్యాన్‌ ఫార్మాక్యూటి కల్స్‌, నాట్కోఫార్మా, మర్కసాన్స్‌ ఫార్మా, ఆర్‌పిజి లైఫ్‌సైన్స్‌, ఫైజర్‌ కంపెనీలు 3నుంచి 8శాతం మేర దిగజారాయి. లూపిన్‌ ఏడుశాతం క్షీణిం చి 1736చొప్పున ట్రేడింగ్‌ జరిగింది. కంపెనీ గోవాయూనిట్‌ను అమెరికా ఎఫ్‌డిఎ ప్రతినిధి బృందం తనిఖీ చేసిం దన్న సమాచారమే కారణం. క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ 70శాతానికిపైగా దిగజారాయి. శాస్కెన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌ 11శాతం పెరిగాయి. ముందురోజు లాభాలు 20శాతం నుంచి కొంతపెరిగా యి. చక్కెర ఉత్పత్తి కంపెనీలు గరిష్ట స్థాయిలోనే ముగిసాయి. మన్నారి అమ్మన్‌ సుగర్స్‌, దాల్మియా భారత్‌ సుగర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, ద్వారకేష్‌ సుగర్‌ ఇండస్ట్రీస్‌, ఔధ్‌ సుగర్‌ మిల్స్‌, రిగా సుగర్‌ కంపెనీ 52వారాల గరిష్టస్థాయిని చేరా యి. స్పైస్‌జెట్‌ రెండుశాతం పెరిగింది. పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ రెండుశాతం పెరిగాయి. ఆస్ట్రేలియాకు చెందిన సేల్‌ఫోర్స్‌ భాగస్వామి, క్లౌడ్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ పిఆర్‌ఎం క్లౌడ్‌ సొల్యూషన్స్‌ కొనుగోలుచేసినట్లు ప్రకటించడమే ఇందుకు కీలకం.