స్టాక్‌ మార్కెట్లకు బడ్జెట్‌ ఎఫెక్ట్‌

BSE-
BSE-

స్టాక్‌ మార్కెట్లకు బడ్జెట్‌ ఎఫెక్ట్‌

ముంబై: ప్రధాని నరేంద్రమోడీ రైతులకు, మధ్య తరగతి ప్రజలకు అనుగుణంగా ఉండే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సంచనలమే సృష్టించారు. ఎన్నికలు కాలం దగ్గరపడుతుండ డంతో ఈ బడ్జెట్‌ కచ్చితంగా ఓటు బ్యాంకులను బలోపేతం చేస్తుంద నడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఈ బడ్జెట్‌ వల్ల ఏఏ స్టాక్స్‌ పెరుగుతాయో, ఏఏ స్టాక్స్‌ తగ్గుతాయో అన్న సందేహాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ రైతులకు పెద్ద పీట వేశారు. సంవత్సరానికి ఎకరానికి రూ.ఆరువేల చొప్పున నగదు సాయం చేయనుండడంతో రైతుల వ్యవసాయానికి చేయూతగా నిలుస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇదే రైతులకు రుణ మాఫీలు కూడా ఇవ్వడంతో ఇప్పుడు వారి కొనుగోలు శక్తి పెరిగినట్లేనని ఎనలిస్టులు భావిస్తున్నారు. వ్యవసాయం జోరందుకోనుండటంతో, వ్యవసాయ ఉపకర ణాలు, పనిముట్లు వంటి వాటికి డిమాండ్‌ పెరిగింది. మహీంద్రా, ఐషర్‌ ఇండియా వంటి కంపెనీల షేర్లు కూడా పెరగవచ్చు. అలాగే ఎరువులు, సిమెంట్‌ కంపెనీలకు కూడా డిమాండ్‌ పెరగవచ్చు. అదేవిధంగా రియాల్టీ కూడా 2020 వరకూ నమోదు అయ్యే ప్రాజెక్టులకు పన్ను మిన హాయింపు లభించడంతో రియాల్టీ రంగం జోరందుకుంది. గృహ నిర్మాణంలో కూడా ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన పథకం కొనసాగింపు కూడా మధ్య తరగతి ప్రజలను ఇళ్ల కొనుగోలువైపు నడిపిస్తాయి. అంతేకాకుండా రూ.2కోట్ల వరకూ పన్ను మినహాయింపు కూడా రియల్‌ ఎస్టేట్‌ రంగం లో పెట్టుబడులు పెరగడానికి కారణమవుతుందని ఎనలిస్టు లు భావిస్తున్నారు. ఒక సంవత్సరం పన్ను మినహాయింపు కొత్త ప్రాజెక్టులకు ఉపయోగకరంగా ఉంది. కాబట్టి, మళ్లీ రియాల్టీ రంగం జోరందుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నా రు. పిఎస్‌యు బ్యాంకులు కూడా ఈ బడ్జెట్‌లో ప్రభు త్వ రంగ బ్యాంకులకు 2.6 లక్షల కోట్ల నిధులను మూల ధనంగా కేటాయిస్తున్నట్లు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్రాన్ని, రిజర్వ్‌బ్యాంకు ను కూడా కోరాయి. ఇప్పుడు ఈ నిధుల కేటాయింపుతో ఆయా బ్యాంకుల షేర్లు పెరిగే అవకాశముంది. వినియోగ రంగం కూడా మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయిం పుల, రూ.5లక్షల ఆదాయంలోపు ఇన్‌కం టాక్స్‌ లేకపోవ డం వంటి అంశాలు మధ్యతరగతి రంగానికి పూర్తిగా లాభం చేకూర్చినట్లు. టాక్స్‌ రాయితీలతో వారి కొనుగోలు శక్తి పెరగనుందని, వినియోగదారులు ఎక్కువగా ఉన్న ఆటో, ఎఫ్‌ఎంసిజి, బిల్డింగ్‌ మెటీరియల్‌, ఇన్యూరెన్స్‌ వంటి రంగాలు పెరగవచ్చని వారు భావిస్తున్నారు. ప్రధా నంగా ఎఫ్‌ఎంసిజి రంగం ఈ 2020 ఆర్థిక సంవత్సరం భారీ లాభాలను సాధించవచ్చని ఎనలిస్టులు పేర్కొంటు న్నారు. సిమెంట్‌ రంగం కూడా గత సంవత్సరం పతన దిశలోనే నడిచిన సిమెంట్‌ రంగం, ఈ బడ్జెట్‌ తర్వాత పెరిగే అవకాశముందని ఎనలిస్టులు భావిస్తున్నారు. నిర్మాణ రంగం పెరగడం, బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు దక్కడంతో పలు ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. దీంతో సిమెంట్‌ గిరాకీ పెరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.