స్టాక్‌ మార్కెట్లకు బడ్జెట్‌ మద్దతు

share
Stoke market

స్టాక్‌ మార్కెట్లకు బడ్జెట్‌ మద్దతు

ముంబై, : కేంద్రబడ్జెట్‌లో కొన్ని సానుకూల అంశాలు లభించడంతో స్టాక్‌ మార్కెట్లు బడ్జెట్‌ అంచనాలకు అనుగు ణంగానే పెరిగాయి. ఆర్థిక మంత్రి ప్రసంగంముగించే సరికే నిఫ్టీ, సెన్సెక్స్‌ రెండూ కూడా సాలనుకూలంగా పెరిగాయి. నిఫ్టీ 8700 స్థాయిని దాటగా బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 28వేల పాయింట్లస్థాయిని అధిగమించింది. దీర్ఘకాలిక మూలధన లబ్దిపై పన్ను వంటి వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా ఆర్థికలోటును 3.2శాతానికి తీసుకురావడం మంచిపరిణామంగా ఇన్వెస్టర్లు, ట్రేడ ర్లు భావించారు. సెన్సెక్స్‌ 486 పాయింట్ల ఎగు వన 28,141 పాయింట్లవద్ద స్థిరపడగా నిఫ్టీ 50 సూచి 155 పాయింట్ల ఎగువన 8716 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 1.7శాతం గరిష్టంగా పెరిగాయి. మార్కెట్లలో బిఎస్‌ఇపరంగాచూస్తే 1920 కంపెనీ లు లాభపడితే 901 కంపెనీలు స్వల్పంగా క్షీణిం చాయి. మొత్తంగా 111 కంపెనీలషేర్లు స్థిరంగా నిలి చాయి. ఇదొక కీలకమైన, సమర్ధవంతమైన బడ్జెట్‌ గా రేటింగ్‌సంస్థలు చెపుతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ ను పాటించిందని, స్థూల ఆర్థికవ్యవస్థపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అత్యధికశాతం జన అంచనాలకు అనుగుణంగా నడిచిందన్నారు. ఆర్థికలోటు 3.2 శాతం రానున్న సంవత్సరంలో 3శాతానికి పరిమి తం చేయడం అనేది కీలకం అవుతున్నదని ఏంజెల్‌ బ్రోకింగ్‌ సిఎండి దినేష్‌ ఠక్కర్‌ అన్నారు. ఎరువు లు, నీటిపారుదలరంగాలకు చెందిన కంపెనీల షేర్లు మూడుశాతం నుంచి ఏడుశాతంవరకూ పెరిగాయి. వ్యవసాయరంగం వచ్చే ఏడాది 4.1శాతానికి వృద్ధి సాధిస్తుందని అంచనా జరిగింది. దీపక్‌ ఫర్టిలైజర్స్‌, పెట్రోకెమికల్స్‌ 7.3శాతం పెరిగాయి. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ 5.2శాతం పెరిగింది. మద్రాసు ఫెర్టి లైజన్స్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ 5శాతం, మూడు శాతం చొప్పున పెరిగాయి. రియల్‌ఎస్టేట్‌కంపెనీలు ఏడుశాతం పెరిగాయి. రియాల్టీరంగానికి బడ్జెట్‌లో ఊతం ఇవ్వడమే ఇందుకుకీలకం. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, యూనిటెక్‌, ఓబరా§్‌ు రియాల్టీ, డిఎల్‌ఎప్‌, హౌసింగ్‌ డెవలప్‌ మెంట్‌ ఇన్‌ఫ్రా (హెచ్‌డిఐఎల్‌) ప్రెస్టిజ్‌ఎస్టేట్స్‌ ప్రాజెక్టుల పరంగా రియాల్టీ సూచీలో 2 నుంచి ఏడు శాతం పెరిగాయి. బిఎస్‌ఇ ఆయిల్‌గ్యాస్‌ సూచి కూడా 1.5శాతం పెరిగింది. ఐఒసి, బిపిజిఎల్‌, హెచ్‌పిసిఎల్‌ 2.5శాతం, 1.8శాతం, 3.4శాతం పెరిగాయి. ఆటోమొబైల్‌ కంపెనీలు పరంగా కూడా ఐదుశాతం పెరిగాయి. మహీంద్ర అండ్‌ మహీం ద్ర, మారుతిసుజుకి ఇండియా ఐదుశాతం పెరిగిం ది. 1298రూపాయలు, 6170 రూపాయలుగా పెరిగాయి. టాటా మోటార్స్‌, హీరోమోటోకార్ప్‌, ఐషర్‌మోటార్స్‌, టివిఎస్‌మోటార్‌ కంపెనీ రెండు, నాలుగుశాతం మేర పెరిగాయి. ఇక విదేశీ మార్కెట్లపరంగాచూస్తే ఆసియామార్కెట్లు వ్యూహా త్మకంగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ అమలుచేస్తున్న కొత్త విధానాలతో మార్కె ట్లు అనుగుణంగా పెరుగుతున్నాయి. చైనా, తైవాన్‌, మలేసియా, వియత్నాం వంటి మార్కెట్లు శెలవుతో మూతపడ్డాయి. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశాలు ఈరోజు నుంచి రెండురోజుల పాటు జరుగుతుండటంతో ఫెడ్‌ రిజర్వు విధా నాలు కూడా మార్కెట్లకు కీలకంగా మారాయి.