స్కిన్‌షోకులు

                                    స్కిన్‌షోకులు

CUTE
CUTE

చర్మం అనేక పొరలతో కూడుకుని ఉంటుంది. పై పొర అయిన ఎపిడెర్మిస్‌ అనేక కణాలతో రూపొంది ఉంటుంది. లోపలి పొరలలో కొత్త కణాలు ఉత్పత్తి అవ్ఞతుంటే పాతవి చర్మంపైకి వస్తాయి. వాటి జీవిత కాలం ముగిశాక మరణిస్తుంటాయి. ఈ మృతకణాలపై పేరుకునే మురికి వల్ల పిగ్మెంటేషన్‌ వచ్చే అవకాశాలున్నాయి. స్క్రబ్‌లను ఉపయోగించడం వల్ల మృతకణాలు తొలగిపోయి, చర్మం మృదువ్ఞగా మెరుస్తుంది.

నారింజ, నిమ్మ: ఇది ఎప్పటి నుంచో ఇళ్లలో తయారు చేసుకునే స్క్రబ్‌, నారింజ లేదా కమలా, నిమ్మతొక్కల్ని ఎండబెట్టి నీడలో ఆరనివ్వాలి. ఆ తరువాత పొడికొట్టి భద్రపరుచుకోవాలి. చర్మానికి మేలు కలిగించే విటమిన్‌’సి దీనిలో వ్ఞంటుంది. రెండుస్పూన్లు ఈ పొడి, రెండు స్పూన్లు వీట్‌బ్రాన్‌, అరచెంచా తేనె, కొద్దిగా పాలు కలిపి పేస్టులా చేసి స్నానానికి ముందు ముఖం మెడ, చేతులకు గుండ్రంగా రాసుకోవాలి.

బాదం: సాధారణ చర్మం గలవారికి బాదం స్క్రబ్‌బాగా పనిచేస్తుంది. పాలలో ఆరుబాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే నూరి ముఖానికి రాసుకుని కాసేపాగి నీటితో కడిగేయాలి. దీనివల్ల విటమిన్‌ ‘ఇ అధికంగా లభిస్తుంది. పిగ్మెంటేషన్‌ మచ్చలు పోతాయి.

శనగపిండి: చర్మం జిడ్డుగా వ్ఞన్నవారికి ఈ స్క్రబ్‌ చక్కగా పనిచేస్తుంది. నాలుగుస్పూన్లు శనగపిండిని, అరస్పూన్‌ పసుపు, కొద్ది చుక్కలు రోజ్‌వాటర్‌, పాలు కలిపి రాసుకోవాలి. పొడి చర్మం గలవారు పాలకు బదులు మీగడ కలుపు కోవచ్చు. ఒక స్పూన్‌ పెరుగులో రెండు చెంచాల మెంతు లను ఓ గంట నానబెట్టి మెత్తగా రుబ్బి ముఖా నికి, మెడకు రాసి పావ ్ఞగంటాగి కడిగేయాలి. స్పూన్‌ అనాసగ ుజ్జును, స్పూన్‌ బాదంపొడితో కలిపి మెడకు, ముఖానికి పట్టించాలి. జిడ్డు అధి కంగా వ్ఞండే భాగాలపై శ్రద్ధ చూపాలి.