సౌందర్య రక్షణరంగంలో ‘అల్యూర్‌’

ALLURE
హైదరాబాద్‌ : చర్మ సంరక్షణ, సౌందర్య పోషణకు రానురాను పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని దేశీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనే చదివి శిక్షణ పొంది ఉన్నత విద్యాభాసంతోపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన డా.సైదా ఎంఎఖాన్‌ ప్రవేశపెట్టిన అల్లూర్‌ ప్రస్తుతం నగరంలో విస్తరణ బాటలో ఉంది. బంజారాహిల్స్‌లో అల్యూర్‌పేరిట ప్రారం భించిన ఈ స్కిన్‌కేర్‌ క్లినిక్‌ ఆత్మవిశ్వాసం కలిగిన లుక్స్‌తో కలలకు వాస్తవరూపం ఇచ్చుకునే అంద రికీ ఎంతో ప్రయోజనకరమని డా. సైదా పేర్కొన్నారు. బ్యూటీ ఈస్థటిక్స్‌పట్ల ఎప్పుడూ అభిమానం ప్రదర్శించే డా. సైదా ఎంఎఖాన్‌ ఇతరులకు కూడా ఎక్కువ సలహాలు సూచనలు అందిస్తారు. కెనడాలోను, కువైట్‌లోను విద్యాభ్యాసం, హెటెక్‌ శిక్షణ పొందారు. ఢిల్లీలో డిప్లమో ఇన్‌ ఈస్థటిక్స్‌ చేసారు. కలలకు వాస్తవరూపం ఇచ్చుకునేవారికి అల్యూర్‌ రెడ్‌కార్పెట్‌ వేస్తుందని డా.సైదా ఎంఎ ఖాన్‌ వెల్లడించారు. చర్మసంరక్షణను పునర్వి చించడానికి కొత్త హంగులు అమలుకు తెచ్చిన ఏకైక సంస్థ అల్యూర్‌ అని ఖాన్‌ వెల్లడించారు.