సౌందర్యానికి ఉత్తానాస‌నం

YOGA
YOGA

సౌందర్యానికి ఉత్తానాస‌నం

కష్టపడందే మనకి ఏదీరాదు. ఇష్టపడే దానికోసం కొద్దిగా కష్టపడడంలోనే మరింత అందం, ఆనందం ఉంది. ఆహార, విహార నియమాలు ఎన్ని పాటించినా, దేహదారుఢ్యానికి, శరీర సౌందర్యానికి కొద్దిపాటి వ్యాయామాలు మనం చేసుకోక తప్పదు. అవేమిటో తెలుసుకుందాం. పుట్టుకతో ఎంత నాజూకు, లావణ్యం, అందం ఉన్నవాళ్లయినా దానిని కలకాలం నిలుపుకోవా లన్నా కూడా వ్యాయామం అలవరచుకోవాలి. అందు లోనూ ఇంటి పనులు చేయడానికి సమయం సరిపోనివాళ్లు ఉన్న సమయంలోనే కొంత సమ యాన్ని కేటాయించుకుని నిత్యం వ్యాయామం చేస్తూ ఉంటే శరీరం నవనవ లాడుతూ, నిత్య నూతనంగా ఉంటుంది. అయితే వీటికోసం వేలకి వేలు ఖర్చుపెట్టుకుని జిమ్ములకి పరుగులు తీయ నవసరం లేదు. ఇంట్లోనే సింపుల్‌గా చేసుకునే వ్యాయామాలు నేడు అన్ని వారపత్రికలు, మేగజైన్లు, టీవీఛానల్స్‌ అంది స్తున్నాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ప్రాక్టీసు చేసుకోవచ్చు. అదీకాక ఎందరో ఈరోజుల్లో స్వచ్ఛంద సేవాసంస్థలు, ఉచిత శిక్షణా తరగతులు ఏర్పాట్లు చేసి, అందరికీ సేవలందిస్తున్నారు. అలాంటివి ఎక్కడ ఏర్పాటు చేసినా శ్రమ అనుకోకుండా వెళ్లి వారి శిక్షణలో మెళకువలు నేర్చుకుని మనం ఇంటి దగ్గర ఆచరిస్తూ ఉంటే మరీ మంచిది. ఏది ఏమైనప్పటికీ కాయకష్టం చేస్తేనేగాని, శరీరం దృఢంగా ఉండదు. శరీరంలోని కొవ్ఞ్వ పదార్థాల్ని కరిగించే శక్తి వ్యాయామానికే ఉంది. ఇప్పుడు ఇంట్లో క్రమం తప్పకుండా చేసే ఆసనాలు పరిశీలిద్దాం. నిటారుగా నిలబడి రెండు చేతుల్నీ నడుము రెండువైపులా ఉంచి, క్రమపద్ధతిలో ఊపిరితీస్తూ, వదులుతూ కుడిచేతిని పైకెత్తి, తలమీదుగా పూర్తిగా తీసుకువచ్చి, ఎడమవైపుకి వంగి తిరిగి యధాస్థితికి వస్తూ, అలాగే ఎడమ చేతిని పైకి ఎత్తి తలమీదుగా తీసుకుని వచ్చి కుడివైపుకి వంగాలి. ఇలా ఎడమవైపు ముందు 5సార్లు, అలాగే కుడివైపు 5సార్లు చెయ్యాలి. తరువాత క్రమంగా సంఖ్యని మీ వీలుని బట్టి పెంచుకోవచ్చు. అయితే రెండువైపులా అదే సంఖ్యలో చేయాలి. దీనివలన నడుముకి ఇరుపక్కలా ఉండే భాగం గట్టిదనాన్ని సంతరించు కుంటుంది. చేతులు కూడా అటూఇటూ వంచడం వల్ల బాహువ్ఞలు బలంగానూ, అందం గానూ రూపుదిద్దుకుంటాయి. దానితో పాటే మెడ నరాలు చురుకుదనాన్ని పొందుతాయి. తిరిగి నిటారుగా నిలబడి నమ స్కారముద్రలో రెండు చేతుల్నీ పూర్తిగా పైకెత్తి, ఒక క్రమంలో గాలి పీలుస్తూ, వదులుతూ నెమ్మదిగా కుడికాలు సగం వరకూ రానిచ్చి, కుడిపాదాన్ని ఎడమకాలి మోకాలి మీద ఉండేలా చూసుకోవాలి. అంటే ఈ భంగిమలో మనం ఒంటికాలి మీద ఉన్నామన్న మాట. అలాగే కొద్ది నిముషాలు నిలబడి, తిరిగి యధాస్థితికి వచ్చి, మళ్లీ ఎడమకా లితో అలాగే చెయ్యాలి. ఇలా రెండు కాళ్లమీద నిలబడి ఉచ్ఛ్వాస నిశ్వా సలు క్రమంలో పాటిస్తే కాళ్లు బలాన్ని పుంజుకుని ఎంతో ఆరోగ్యం గా ఉత్సాహంగా ఉంటారు. ఇలాంటి చిన్నచిన్న సూత్రాలు పాటించడం అలవాటుగా మార్చుకుంటే, జీవితకాలం శరీరం లావ్ఞ పెరగడం, ఊబ శరీరం రావడం, శరీరంలో కొన్ని భాగాలు పెరగడం లాంటివి మనజోలికి రావ్ఞ. అంతేకాక జీర్ణశక్తి పెరగడం, శరీరంలో కొవ్ఞ్వపదార్థాలు పెరగకుండా ఉండడం, మనసు నిర్మలంగా ఉండడం ఇలాంటి ఎన్నో ప్రయో జనాలు పొందవచ్చు. మనకి దగ్గర్లో ఉన్న యోగా కంద్రానికి వెళ్లి అక్కడి మాస్టర్ల శిక్షణలో ప్రాక్టీసు చేసి ఆచరించడం ఎంతో మంచిది.