సోమ్‌నాథ్ మృతికి ప్ర‌ముఖుల సంతాపం

Somnath Chatterjee
Somnath Chatterjee

న్యూఢిల్లీః లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ(89) మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఛటర్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సోమ్‌నాథ్ ఛటర్జీ మృతి విచారకరమని పేర్కొన్నారు. దేశ ప్రజలతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రజలు.. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారని వారు కొనియాడారు. లోక్‌సభ స్పీకర్‌గా ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివి అని పేర్కొన్నారు.